ఫిబ్రవరి ప్రారంభం నుంచి పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 270 పెరిగింది. దీంతో పసిడి ధరలు దాదాపు రూ. 63000 (10 గ్రామ్స్)కు దగ్గరగా చేరాయి.
హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57450 (22 క్యారెట్స్), రూ.62670 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగినట్లు తెలుస్తోంది.
చెన్నైలో నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఈ రోజు రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. దీంతో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58000 (22 క్యారెట్స్), రూ. 63270 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి.
ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 250 పెరిగి 57600 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 270 పెరిగి 62820 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనే పెరుగుదలవైపు అడుగులు వేసాయి.
వెండి ధరలు
బంగారం ధరలు పెరిగిన తరుణంలో వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నేడు ఒక కేజీ వెండి ధర రూ. 76000 వద్ద ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తక్కువ. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా వెండి ధరలు తగ్గాయి.
ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా..
Comments
Please login to add a commentAdd a comment