అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌లు ప్రారంభ సమయానికి బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభ మయ్యాయి. కొద్ది సేపటికే లాభాల్లోకి జారుకున్నాయి. ఇలా ఒడిదుడుకుల మధ్య ఉదయం 9.50 గంటల సమయానికి స్టాక్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
సెన్సెక్స్ 152 పాయింట్లతో 71292 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 21576 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
ఇక టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎథేర్ మోటార్స్, ఎం అండ్ ఎం, ఓఎన్‌జీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. లార్సెన్, టైటాన్ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్, ఎల్ టీఐ మైండ్ ట్రీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment