
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వారం రోజుల తరువాత మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను గత సంవత్సరం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఏడు రోజులు అంటే మరీ లాంగ్ అనుకున్నారో ఏమో 24 గంటల్లోనే మెసేజ్‌లు డిలిట్ అయ్యే ఫీచర్‌పై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తుంది వాట్సాప్. దీనితో పాటు సెల్ఫ్–డిస్ట్రక్టింగ్ ఫొటో ఫీచర్ కూడా ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది. కాగా గత కొన్ని రోజులుగా వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో, వాట్సప్‌లోని ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేసుకునే వీలు కల్పించేలా ఫీచర్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, మళ్లీ చాట్స్ ని రీస్టోర్ చేసే సమయంలో పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నట్లు 'వాబీటా ఇన్ఫో' సమాచారం ఇచ్చింది. ఇక ఈ ఫీచర్ వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు.