
Whatsapp Message Reaction Feature: ఒక చిత్రం వందపదాల భావాన్ని చెబుతుంది అంటారు. సెల్‌ఫోన్ విషయానికి వస్తే...మాట్లాడటానికి టైమ్ లేకపోతే మెసేజ్ పెడతాం. మెసేజ్ కూడా పెట్టేంత టైమ్ లేకపోతే ఒక ఇమోజీ చిత్రాన్ని పంపిస్తే సరిపోతుంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఓఎస్ యూజర్స్ కోసం ‘న్యూ మెసేజ్ రియాక్షన్ ఫీచర్’ను తీసుకురానుంది. లైక్, లవ్ (హార్ట్), లాఫ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్యూ...ఈ ఆరు ఇమోజీలను కొత్త ఫీచర్‌లో ఉపయోగించుకోవచ్చు. నిజానికి ఈ ఫీచర్ సోషల్ మీడియా యాప్స్‌కు కొత్తేమీ కాదు. అయితే వాట్సాప్‌కు మాత్రం ఇది మేజర్ అప్‌డెట్‌గా చెబుతున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తీవ్రపోటీ నెలకొంది. సరికొత్త ఫీచర్లతో రోజుకో కొత్త యాప్ వస్తోంది. ఎన్ని కొత్త యాప్‌లు వచ్చినా యూజర్ బేస్ విషయంలో వాట్సాప్‌కి పోటీ ఇవ్వడం కష్టం. అయితే ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్‌డేట్ కాకుండా యూజర్లను కోల్పోవడానికి ఎంతో సేపు పట్టదు. దీంతో వాట్సాప్ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త ఫీచర్లు యాడ్ చేస్తోంది.