
వాట్సాప్ కాల్స్ చేసే వారి కోసం అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది దాని యాజమాన్య సంస్థ మెటా. తరచూ వాట్సాప్ ద్వారా కాల్స్ చేసే వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా కాలింగ్ షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంపై కసరత్తు చేస్తోంది. దీని వల్ల మనం ప్రతిసారి కాంటాక్ట్స్ లిస్ట్‌లోకి వెళ్లాల్సిన పని లేకుండా తరచూ చేసే కాల్స్‌కు హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇటీవల కాలంలో నేరుగా కాల్స్ చేసేవారితో పాటు వాట్సాప్ ద్వారా కాల్స్ చేసేవారు ఎక్కువయ్యారు. వేరే రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు చాలామంది వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు. ఇటువంటి వారి కోసం మెటా సంస్థ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మనం ఎవరితో అయితే తరచుగా కాల్స్ చేస్తుంటామో దానికి సంబంధించిన కాంటాక్ట్‌కు షార్ట్‌కట్ క్రియేట్ చేయగానే అది ఆటోమేటిక్‌గా హోం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ షార్ట్‌కట్‌ను అలా ట్యాప్ చేయగానే వెంటనే కాల్ వెళ్తుంది. ఈ ఫీచర్.. రానున్న అప్‌డేట్‌తో అందుబాటులోకి రానుంది.
నియోగదారులు వాట్సాప్ ద్వారా ఫొటోలను ఒరిజినల్ క్వాలిటీతో పంపే సౌలభ్యాన్ని సైతం తీసుకొస్తున్నట్లు యాజమాన్యం గత నెలలో ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము పంపే ఫొటోల క్వాలిటీని వారికి నచ్చినట్లుగా కంట్రోల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment