పల్లె ముంగిటకే పాలన తేవాలి.. పేదల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తలిచారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అన్ని సేవలను ప్రజల దరి చేర్చి, గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించారు. ఈ సేవలపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు
పుంగనూరు: బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా వలంటీర్లను భాగస్వాములను చేశారు. రాష్ట్రమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి సొంత ని యోజకవర్గంలో సచివాలయ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది.
జగనన్నకు రుణపడి ఉంటాం
ఆపదలో ఉన్న తమ కు టుంబానికి ఆర్థికంగా చే యూతనిస్తూ ఆదుకుంటు న్న సీఎం జగనన్నకు రుణ పడి ఉంటాం. నేను మానసిక వికలాంగుడిని. గతంలో విగలాంగ పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ న్యాయం జరగలేదు. సచివాలయంలో అర్జీ ఇచ్చిన వెంటనే వలంటీర్ సహకారంతో నా సమస్యను పరిష్కరించారు. నాకు నెల నెలా రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందుతోంది.
– లోకేష్, చిట్రెడ్డిపల్లె, చౌడేపల్లె మండలం
సొంత ఇంటి కల నెరవేరింది
సచివాలయాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభు త్వ పథకాలు మాకు ఇంటి వద్దకే చేరుతున్నాయి. నాకు సొంత ఇల్లు లేదని గతంలో పలుసార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఏర్పా టు చేసిన సచివాలయంలో అర్జీ ఇచ్చాను. విచారించి నాకు అధికారులు ఇల్లు మంజూరు చేశా రు. నాకు అధికారులు దశల వారీగా బిల్లులు చెల్లించారు. నా సొంతిటి కల నెరవేరింది.
–కె. జయశ్రీ, చిట్రెడ్డిపల్లె, చౌడేపల్లె మండలం
పేదలకు వరం
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, సర్టిఫికెట్లు తీసుకునే బాధ తప్పింది. నాకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కులం, ఆదాయం సర్టిఫికెట్లను ఉ చితంగా తీసుకున్నాను. జీవితాంతం సులభంగా సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. స ర్టిఫికెట్ నంబర్ చెప్పితే మళ్లీ సర్టిఫికెట్ ఇస్తారు. ఎవరి దగ్గరికీ తిరగాల్సిన అవసరం లేదు. సీఎం అమలు చేస్తున్న పథకాలన్నీ పేదలకు ఒక వరంలాంటివి. ఇలాంటి సీఎం ఉండడం ఏపీకి మంచిది.
– శిల్ప, రామచంద్రాపురం కాలనీ, రొంపిచెర్ల మండలం
రెండు రోజుల్లోనే పరిష్కారం
ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల కోసం వలంటీర్‌కు చెప్పిన వెంటనే అర్జీ తీసుకుని, వెళ్లింది. తరువాత రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ ఇంటికి వచ్చి అందజేసింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో రోజుల తరబడి మండల కార్యాలయం చుట్టూ తిరిగేవారం. అయినా పని జరిగేది కాదు. జగన్న సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తరువాత ఏసమస్య అయినా వెంటనే పరిష్కారమవుతుంది. అడిగిన వెంటనే మా సమస్యను పరిష్కరించినందుకు మేము జగనన్న మేలు ఎప్పటికీ మరువలేం.
– ఆర్.షబీనా, ఎగువవీధి, కల్లూరు, పులిచెర్ల మండలం
నా ఇంటి వద్దకే సర్టిఫికెట్లు
నేను వ్యాపారం చేసి జీవిస్తున్నాను. సచివాలయాలకు సకాలంలో వెళ్లలేక పోవడంతో వలంటీర్, సచివాలయ కార్యదర్శులు మా ఇంటి వద్దకే వచ్చి మా పిల్లల పుట్టిన సర్టిఫికెట్లు అందజేశారు. గతంలో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే దేవుడు కనిపించేలా కష్టపడేవాళ్లం. ఇప్పుడు జగనన్న దేవుడులా మా ఇంటి వద్దకే వలంటీర్ వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేనిది. తిరిగి ఆయనే సీఎం కావాలని కోరుతున్నాను.
–ఎం.బాబు, ఆవుల వ్యాపారి, పుంగనూరు
ప్రదక్షిణలు తప్పాయ్
ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం గత ప్రభుత్వ హయాంలో మండల కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాము. జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ మా ఇంటికే వచ్చి మా సమస్యను తెలుసుకుని, ఇంటికే అన్ని రకాల ధ్రువపత్రాలు తెచ్చి ఇచ్చారు. దీంతో మాకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే పని తప్పింది. అన్ని సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తోంది. జగనన్నకు మేము ఎప్పుడూ రుణ పడిఉంటాం.
– ఎం. సరస్వతి లబ్ధిదారు, ఊడగమాకులపల్లె, పులిచెర్ల మండలం
అందుబాటులో సిబ్బంది
గత ప్రభుత్వ హ యాంలో ఏ పనికై నా మండల కేంద్రంలోని కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. సచివాలయ వ్యవస్థ ఏర్పడిన అనంతరం ఆ బాధ తప్పింది. సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది అంటుబాఽటు లో ఉండడంతో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత వ్యవధిలోపే సమస్య పరిష్కారం అవుతోంది.
– దుర్గా ప్రసాద్‌రెడ్డి, బళ్లావాండ్లపల్లె, సదుం మండలం
Comments
Please login to add a commentAdd a comment