సాక్షి, తిరుపతి: ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనని టీడీపీలో ఆందోళన మొదలైంది. అందుకే ఇప్పు డు చంద్రబాబు తనమీద తానే రాళ్లు విసిరించుకుని సింపతీ పొందా లని చూస్తున్నారు’అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాళ్లు వేయించుకున్నంత మాత్రాన సింపతీ రాదని చంద్రబాబుకు చురకలు అంటించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి పేరు కోసం టీడీపీ వారే సీఎం వైఎస్ జగన్‌పై రాళ్లు విసిరారని మండిపడ్డారు.
ఒకే రాయి.. సీఎంకు తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కి తగిలిందని గుర్తుచేశారు. ఆయన కూడా కంటికి చికిత్స తీసుకుంటున్నారన్నారు. ఇవేమీ చంద్రబాబు అండ్ కోకు కనిపించవా? అని ప్రశ్నించారు. అయినా కూడా తనపై రాళ్ల దాడి జరిగిందని చంద్రబాబు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి కానీ.. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై చంద్రబాబు, లోకేష్ నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా రాళ్లు వేసినట్టు చంద్రబాబు డ్రామా ఆడారని గుర్తుచేశారు. అలిపిరి ఘటన తర్వాత సింపతీతో ఎన్నికలు గెలుద్దాం అని ముందస్తుకు వెళ్లి ఓడిపోయారని గుర్తుచేశారు. సింపతీతో ప్రజలు ఓటు వేయరని, చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని సూచించారు.
సింపతీతో జనాలు ఓట్లేయరనే విషయం చంద్రబాబుకు అనుభవపూర్వకంగా తెలుసునంటూ చురకలంటించారు. తండ్రి నీచంగా మాట్లాడుతుంటే, తనయుడు లోకేష్ మరింత నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అండగా ఉంటే.. ప్రజలు నేతలపై నమ్మకం ఉంచుతారని తెలిపారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి ఘటనను ఇప్పుడు ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే కనీసం మర్యాదపూర్వకంగా పరామర్శకు రావాల్సింది పోయి.. నీఛ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment