ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన ఆద్యంతం అభివృద్ధి.. ఆధ్యాతి్మకం తొణికిసలాడింది. సనాతన సంప్రదాయాన్ని కొనసాగించడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. గత ప్రభుత్వం పునాది దశలో వదిలేసిన శ్రీనివాస సేతు వంతెన ప్రారంభం నగర వాసుల్లో ఆనందం నింపింది. ఏళ్లుగా మరుగునపడ్డ టీటీడీ ఉద్యోగుల కల సాకారం కావడం తండ్రిని మించిన తనయుడు అనిపించింది. ఆధునిక సొబగులతో తీర్చిదిద్దిన వసతి సముదాయం ప్రారంభంతో జై జగన్ నినాదాలు విద్యార్థి లోకం మిన్నంటించింది. ఆపై శ్రీవారి సోదరి తాతయ్యగుంట గంగమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొదటిసారి పట్టువస్త్రాలు సమరి్పంచడం ప్రాచీన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చింది. తదనంతరం తిరుమలేశుడి బ్రహ్మోత్సవ వేళ ఆ కలియుగ వైకుంఠవాసుడి దర్శనార్థం తిరుమల చేరుకోవడం.. అక్కడ పలు ప్రారంభోత్సవాల అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమరి్పంచడం పలువురిని ఆధ్యాతి్మక చింతనలో ముంచెత్తింది.
తిరుమల/తిరుపతి తుడా/తిరుపతి సిటీ/ తిరుపతి కల్చరల్: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారం రెండు రోజుల పర్యటన ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగింది. మొదట సీఎం వైఎస్.జగన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డుమార్గన తిరుపతి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ రూ.650.50 కోట్లతో 7 కి.మీ పొడవు నిర్మించిన ఆకాశవీధి– శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభించారు. విద్యార్థుల కోసం రూ.37.8 కోట్లతో నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించారు. తర్వాత సుమారు ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.600 కోట్లు ఖర్చుచేస్తున్నారు.
ప్రాతఃకాల దర్శనం
మంగళవారం సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతఃకాల సమయంలో తిరుమల శ్రీవారిని మరోమారు దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. సీఎంకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, వేద పండితులు తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. రెండు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటు స్థానికులు, అటు భక్తులను పేరుపేరునా పలకరిస్తూ ఆకట్టుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన ఆద్యంతం అభివృద్ధి.. ఆధ్యాత్మికం తొణికిసలాడింది. సనాతన సంప్రదాయాన్ని కొనసాగించడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. గత ప్రభుత్వం పునాది దశలో వదిలేసిన శ్రీనివాస సేతు వంతెన ప్రారంభం నగర వాసుల్లో ఆనందం నింపింది. ఏళ్లుగా మరుగునపడ్డ టీటీడీ ఉద్యోగుల కల సాకారం కావడం తండ్రిని మించిన తనయుడు అనిపించింది. ఆధునిక సొబగులతో తీర్చిదిద్దిన వసతి సముదాయం ప్రారంభంతో జై జగన్ నినాదాలు విద్యార్థి లోకం మిన్నంటించింది. ఆపై శ్రీవారి సోదరి తాతయ్యగుంట గంగమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొదటిసారి పట్టువస్త్రాలు సమర్పించడం ప్రాచీన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చింది. తదనంతరం తిరుమలేశుడి బ్రహ్మోత్సవ వేళ ఆ కలియుగ వైకుంఠవాసుడి దర్శనార్థం తిరుమల చేరుకోవడం.. అక్కడ పలు ప్రారంభోత్సవాల అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం పలువురిని ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment