● మాధవరం సమీపంలో ఘటన ● అడవిలోకి పారిపోయిన గుర్తుతెలియని
కళ్లలో కారం కొట్టి .. దారి దోపిడీకి యత్నం
తవణంపల్లె : మండలంలోని మాధవరం సమీపంలోని కనంగట్టు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ ధరించి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్న అక్క, తమ్ముడిపై కారంపొడి చల్లి దోపిడీకి యత్నించాడు. కళ్లలో కారం పొడి పడడంతో అక్క, తమ్ముడు ద్విచక్ర వాహనాన్ని నడపలేక కిందపడిపోయి గట్టిగా కేకలు వేశారు. ఈ క్రమంలో తమ్ముడికి కాలు విరిగిగా అక్కకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. మాధవరం పంచాయితీ ఎం.బోయపల్లెకు చెందిన వినయ్‌రెడ్డి(22), అక్క అరుణ ద్విచక్ర వాహనంలో బుధవారం రాయల్పేట రోడ్డులో మాధవరానికి సుమారు కిలోమీటరు దూరంలో కనంగట్టు వద్ద ఉన్న బండ వద్దకు వినయ్‌రెడ్డి, అక్క అరుణ ద్విచక్రవాహనంలో వస్తుండగా అడ విలో నుంచి గుర్తు తెలియని యువకుడు జర్కిన్ వేసుకొని, నల్లమాస్క్ ధరించి నల్ల టవల్ వేసుకొని వచ్చి కళ్లలోకి కారంపొడి చల్లాడు. అప్పటికే వెనుక వైపు ఎం.బోయపల్లెకు చెందిన రాజారెడ్డి ద్విచక్రవాహనంపై రావడంతో గమనించిన అగంతకుడు అడవిలోకి పారిపోయాడు. స్కూటర్‌పై నుంచి పడిన వినయ్‌రెడ్డికి కాలు విరిగింది. అరుణ స్వల్ప గాయాలు కాగా అగంతకుడి చేతి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు అరగొండ అపోలో హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం చేర్పించారు. దీనిపై తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి మాట్లా డుతూ.. నిఘా పెంచి సీసీ కెమెరాల్లోని ఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దారి దోపిడీ చేశారా? లేక కక్షలతో దాడి చేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. గురువారం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి పశువుల కాపరులు , స్థానికులను ఘటనపై విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment