టీడీపీ నేత బరితెగింపు
● ప్రభుత్వ స్థలం ఆక్రమణ ● భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
శ్రీరంగరాజపురం : మండలంలోని మంగుంట గ్రామంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. గురువారం మంగుంట గ్రామస్థులు విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన టీడీపీ నేత జీవన్బాబురెడ్డి మంగుంట రెవెన్యూలో 19/1,19/2లో సుమారు 0.9 సెంట్ల భూమిని ఆక్రమించారన్నారు. ఈ భూమిని గతంలో గ్రా మస్థులందురూ కలిసి గ్రామ అవసరాలకు 0.9 సెంట్లను కేటాయించినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డులోని ఈ భూమిని సబ్ డివిజన్ చేసి పాలశీతల కేంద్రానికి గతంలో ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో జీవన్బాబురెడ్డి ఈ భూమిలో గోకులంషెడ్డును నిర్మించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గ్రామస్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో బుధవారం రెవెన్యూ సిబ్బంది తని ఖీ చేసి ఈ భూమి ప్రభుత్వానిదని తేల్చేశారు. ఆక్రమణకు గురైన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏవరైనా ప్రభు త్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కూటమి నేతలు చేసే దౌర్జన్యాలను ప్రశ్నిస్తే మాకు ప్రభుత్వం నుంచి అందే పథకాలను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment