రోడ్డు భద్రత పాటించాలి
టీడీపీ నేత బరితెగింపు
కూటమి నేత ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించి ఆ స్థలంలో గోకులం షెడ్డును నిర్మించడంపై స్థానికుల ఆగ్రహం
బాబు మాటలు బూటకం
● ప్రజలను మోసం చేయడంలో దిట్ట ● ప్రతి ఎన్నికల్లోనూ మోసపూరిత హామీలు ● 8 నెలలు అవుతున్నా ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం
‘పీఎం విశ్వకర్మ’ సద్వినియోగం చేసుకోండి
పీఎం విశ్వకర్మ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంఎస్‌ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి పేర్కొన్నారు.
శుక్రవారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2025
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఆర్‌ఎంపీలపై కఠిన నిబంధనలతో పాటు నిషేధం ఉంది. దీంతో జిల్లా సరిహద్దుకు ఆనుకొని ఉన్న పొరుగు రాష్ట్రాల నుంచి ఆర్‌ఎంపీలు ఇక్కడికి వలస వస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇక్కడికి వచ్చి స్థాయికి మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట వీరి వైద్యానికి వృద్ధులు, శిశువులు, గర్భిణులు, పిల్లలు బలి అవుతూనే ఉన్నారు. వీరిని కట్టడి చేసేందుకు జిల్లా వైద్యాధికారులు పటిష్ఠ చర్యలు, తనిఖీలు లేకపోవడంతో చెలరేగిపోతున్నారు. వీరికి అండగా ఉండేలా కొంత మంది యూనియన్ నాయకులు వీరికి వత్తాసు పలుకుతూ రాజకీయాలు చేస్తూ జిల్లా అధికారులనే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
కాణిపాకం : ఆర్‌ఎంపీలకు జిల్లా అడ్డాగా మారింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆర్‌ఎంపీలు జిల్లాలోకి చొరబడుతున్నారు. సరిహద్దుల్లో కాసుకూర్చున్నారు. ప్రథమ చికిత్స అంటూ పనికానిచ్చేస్తున్నారు. అర్హతతో పని లేకుండా ఐడీ కార్డులు, తప్పుడు పత్రాలతో స్థాయికి మించి వైద్యం చేస్తున్నారు. దీంతో జిల్లాలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు ఉన్నాయి.
ఐడీలతో ఆర్‌ఎంపీల అవతారం
జిల్లాలో ఆర్‌ఎంపీల సంఖ్య గణనీయంగా పెరుగుతో ంది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 3 వేల మంది ఆర్ ఎంపీలు ఉన్నారు. కొంత మంది యూనియన్ నాయకులు ఇచ్చే ఐడీ కార్డులు, పత్రాలను తీసుకుని ఆర్‌ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. ఇందుకు రూ. 10 వేల నుంచి రూ.లక్ష వరకు సమర్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ సర్టిఫికెట్ ఉంటే ఈజీగా డ బ్బులు సంపాదించవచ్చునని ఆర్‌ఎంపీలుగా అవతా ర మెత్తుతున్నారు. ఎలాంటి అర్హత, పరిజ్ఞానం లేకుండా అమాయకుల నాడీ పట్టి ప్రాణాలు తీస్తున్నారు.
అక్కడి నుంచి ఇక్కడికి మకాం మార్చి..
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రాక్టీస్‌ను అక్కడి ప్రభుత్వం నిలుపుదల చేసింది. అక్కడ కొన్ని నిబంధనలు కచ్చితంగా అమలు చేసింది. ఒక వేళ గుట్టు చప్పుడు కాకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే దాడులు చేసి కేసులు బనాయిస్తోంది. దీంతో అక్కడున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తలదాచుకునే ప్రయత్నంలో పడ్డారు. మెల్లగా హద్దులు దాటి జిల్లాను అడ్డాగా మార్చుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించాల్సిన వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో 1300 మంది జిల్లాకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రజలు ఏ రోగమొచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్‌ఎంపీలే. వెంటనే వారి వద్దకు వెళ్లడం చికిత్స తీసుకోవడం, మరునాడే పనులకు వెళ్లడం పరిపాటి. నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే ఇంత త్వరగా రోగం తగ్గదు. అందుకే ఆర్‌ఎంపీలకు అంత గిరాకీ. సదరు ఆర్‌ఎంపీలు వారి వద్దకు వచ్చే రోగులకు ఒక చేతికి పెయిన్ కిల్లర్, మరో చేతికి స్టెరాయిడ్ మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దీంతో ఫలానా డాక్టర్ రెండు సూదులు వేయగానే రోగం తగ్గిపోయిందని గొప్పగా చెప్పుకుని దీర్ఘకాలంలో వచ్చే వ్యాధులను పట్టించుకోవడం మానేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.
రాజకీయ కక్షతోనే పెద్దిరెడ్డిపై కుట్ర
● కూటమి అన్యాయాలపై ప్రశ్నిస్తే కేసులా ?
● గంగాధర నెల్లూరు ఇన్‌చార్జి కృపాలక్ష్మి ధ్వజం
కార్వేటి నగరం : కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు ప్రశ్నిస్తే కేసులా అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కృపాలక్ష్మి మండిపడ్డారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కుట్రలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం నిరంతరం పోరాడే వైఎస్ జగనన్న చుట్టూ ఉన్న బలమైన నాయకులనే టార్గెట్ చేసి అన్ని రకాలుగా దెబ్బతీయడంతో పార్టీని నిర్వీర్యం చేయాలనే కుతంత్రంతోనే కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌పార్టీ పేద ప్రజల కోసం నిరంతర పోరాటాలకు సిద్ధమని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై వారం రోజులుగా చేస్తున్న అసత్య ప్రచారాలను , పచ్చ మీడియా చేస్తున్న దుర్మార్గపు రాతలను ఆమె ఖండించారు.
ఏషియన్ షూటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
గుడుపల్లె : అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు ఉమ్మడి చి త్తూరు జిల్లా క్రీడాకారు లు మొహమ్మద్ యూ సప్, పరశురాముడు ఎంపికై నట్లు చిత్తూరు జిల్లా షూటింగ్ అసోషియేషన్ కార్యదర్శి వేణుగోపాల్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నేపాల్ దేశంలో మూడు రోజులు జరగనున్న రెండో ఏషియన్ షూ టింగ్ బాల్ పోటీలకు భారత క్రీడాకారుడుగా మొహమ్మద్ యూసప్, టెక్నికల్ అఫి సియల్‌గా పరశురాముడు ఎంపికైనట్లు షూ టింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి జీత్‌రాజ్ తోమర్ నుంచి ఉత్తర్వు వచ్చిందన్నారు. మొహమ్మద్ యూసఫ్ ఉమ్మ డి చిత్తూరు జిల్లా మదనపల్లె, పరశురాముడు కర్నూలు జిల్లాకు చెందిన వారన్నారు. చిత్తూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మహేష్, అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, సభ్యులు సెల్వమ్ లోకనాథ్ స్వాతీ జబ్బీర్ సురేష్‌లు వారిని అభినందించారు.
కాణిపాకంలో ప్రిన్సిపల్‌సెక్రటరీ
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వా మిని గురువారం రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకు మారి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శన సేవలు అయ్యేలా చూశారు. తర్వాత వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
కుప్పంలోని ఓ ఆర్‌ఎంపీ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనం
జంతువులతో ఫ్రెండ్లీగా ఉండాలి
గుడిపాల : జంతువులను ఎవరూ హింసించోద్దని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ప్రభాకర్ అన్నా రు. గురువారం నరహరిపేట జడ్పీ హైస్కూల్‌లో జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు జంతువుల పట్ల ఎలా ఉండాలి అన్న అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువులతో ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. జంతువుల యొక్క చట్టాలు, జంతువులపై కలిగిన శాసనాలను విద్యార్ధులకు టీవీ రూపంలో చూపించి వివరించారు. అనంతరం విద్యార్థులకు ఎస్‌ఏ పోటీలు , జంతువులపై స్పీచ్‌ను నిర్వహించారు. ఇందులో ఆరుగురు విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు సాయిసుధ, రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం చిత్తూరు నగరంలో ఆర్టీఓ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీని కలెక్టర్, డీటీసీ నిరంజన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సడక్ సురక్షా అభియాన్ కింద రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మూడేళ్ల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు అధిక సంఖ్యలో మరణించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్‌లను గుర్తించి జాగ్రత చర్యలు చేపడుతున్నామని, గుంతలను పూడ్చడం, పెండింగ్ రోడ్డు పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రజలు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఓ సునీల్‌కుమార్, ఏంవీఐలు రాజేశ్వరరావు, నరసింహులు, శివకుమార్, మురళీ, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు పాల్గొన్నారు.
● కలెక్టర్ సుమిత్‌కుమార్
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం
తమిళనాడు, కర్ణాటక నుంచి తరలివస్తున్న వైనం
అర్హతకు దూరం.. ఐడీ, తప్పుడు పత్రాలతో వైద్యం
జిల్లాలో పుట్టగొడుగుల్లా ఆర్‌ఎంపీలు
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
ఆర్‌ఎంపీపై డీఎంహెచ్‌ఓ విచారణ
ఆర్‌ఎంపీలపై ప్రత్యేక నిఘా
ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. ఆర్‌ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్‌లు చేయడం నేరం. రోగులకు మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్‌లున్) రాయకూడదు. అబార్షనన్‌లు, కాన్పులు వంటి హైరిస్క్ చికిత్సలు చేయకూడదు. రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం, బలవంతంగా పంపించడం చేయకూడదు. జిల్లాలో ఆర్‌ఎంపీలపై ప్రత్యేక నిఘాను పెడుతున్నాం. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.
– సుమిత్‌కుమార్ గాంధీ, కలెక్టర్, చిత్తూరు.
పెనుమూరు క్రాస్‌లో ఇటీవల ఓ ఆర్‌ఎంపీ క్లినిన్‌ను తనిఖీ చేశారు. అక్కడికి పురిటి బిడ్డలను తీసుకొస్తున్నా వైద్యం చేస్తుండడంపై ఆశ్చర్యపోయారు. స్థాయికి మించి సైలెన్ బాటిళ్లు పెట్టడం, అన్ని రకాల మందులు విక్రయిస్తున్నాడని గుర్తించారు. దీనికి తోడు పశువుల మందులు ఇస్తుండడం చూసి విస్తుపోయారు. ఆ ఆర్‌ఎంపీని టచ్ చేసేందుకు అధికారులు వెనుకడుగు వేశారు.
గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఓ ఆర్‌ఎంపీ చేతిలో ఓ వృద్ధుడు బలి అయ్యాడు. అనారోగ్యంతో వెళ్లిన ఆ వృద్ధుడికి స్థాయికి మించి వైద్యం చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన అప్పటి డీఎంహెచ్‌ఓ ఆర్‌ఎంపీ క్లినిక్‌ను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నాడని గుర్తించారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.
బైరెడ్డిపల్లె : చిన్నారి వైష్ణవి మృతికి కారుకులైన ఆర్‌ఎంపీని గురువారం సాయంత్రం బైరెడ్డిపల్లె పీహెచ్‌సీలో డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి విచారణ చేపట్టారు. ఆర్‌ఎంపీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రథమ చికిత్స మాత్రమే రోగులకు అందించాలని హెచ్చరించారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిండికేట్ వ్యాపారం
జిల్లాలో ఆర్‌ఎంపీ సిండికేట్ వ్యాపారంలా మా రింది. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు. స్వార్థం కోసం ఇష్టానుసారంగా పదో తరగతి చదవని వ్యక్తులు కూడా సర్టిఫికెట్లు ఇస్తూ ఆర్‌ఎంపీలను తెరపైకి తీసుకొస్తున్నారు. వీరు ప్రథమ చికిత్స వదిలి మిగిలిన అన్ని వైద్య సేవలు చేస్తున్నారు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిసిన ఏమాత్రం పట్టించుకోవడంలేదు. తనిఖీలు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా తేలికగా వదిలేస్తున్నారు. చూసీ చూడనట్లు మిన్నుకుండిపోతున్నారు. దీంతో జిల్లాలో ఆర్‌ఎంపీల వైద్యం మూడు మాత్రలు, ఆరు సిరంజిలుగా విరాజిల్లుతోంది. ఇక తనిఖీలకు వెళ్లిన కొంత మంది సిబ్బంది వారితో చేతులు కలుపుతున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకుని పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్‌ఎంపీలే అధికం
తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు అధికమయ్యారని అధికారుల గణంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా కుప్పంలో ఆర్‌ఎంపీలు కుప్పలు తెప్పలుగా ఉన్నారని అధికారులు గుర్తించారు. చిత్తూరు, గుడిపాల, శాంతిపురం, పలమనేరు, పుంగనూరు, యాదమరి, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, పాలసముద్రం, గంగవరం, వీ.కోట, కార్వేటీనగరం, శ్రీరంగరాజుపురం, నగరి తదితర మండలాల్లో ఆర్‌ఎంపీ అడ్డాలు చేసుకొని అడ్డగోలుగా వైద్యం చేస్తున్నారని మండల వైద్యాధికారులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నివేదికలు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment