భయపెడుతున్న జీబీఎస్ వైరస్
● కబళిస్తున్న మహమ్మారి ● కేసుల నమోదుతో ఆందోళన ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య నిపుణులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అరుదుగా వచ్చే జీబీఎస్ (గులియన్‌న్‌బారె సిండ్రోమ్) తీవ్రత గతంలో పరిమితంగా ఉండేది. అనేక కారణాలతో ఈ వ్యాధి పీడితుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో పలు కేసులు బయటపడ్డాయి. అన్ని వయసుల వారిని మహమ్మారి కబళిస్తోంది.
జీబీఎస్ లక్షణాలను ఓ పట్టాన అర్థం చేసుకోలేరు. పైకి ఆరోగ్యంగానే ఉంటారు. వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే కనిపిస్తాయి. కానీ క్రమంగా బలహీనపడతారు. ఓ దశలో అచేతనంగా మారిపోతారు. కాళ్లు, చేతులు, మెడ కండరాలతో పాటు..ఒకోసారి తలలోని కండరాలు చైతన్యాన్ని కోల్పోతాయి. రెప్పవాల్చలేని దుస్థితికి చేరతారు. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులుహెచ్చరిస్తున్నారు.
జిల్లాలో నరాల బలహీనత, సమస్యతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఆస్పత్రులకు ఓపీల సంఖ్య అధికమవుతోంది. చాలా మంది నరాల బలహీనతపై అలసత్వం వహిస్తుంటారు. ఇంటి వద్దే పలు రకాల నూనెలు పూస్తూ..ఉండిపోతున్నారు. మరికొంత మంది నరాలు లాగేసిందని బలహీనమని, పక్షవాతమని నాటు మందులు తినేందుకు క్యూ కడుతున్నారు. చాలా మంది చేతబడి చేశారని.. నమ్ముతున్నారు. ఇలా చేయడం ద్వారా నరాల సమస్య పెరిగి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈజీబీఎస్‌పై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాప్తి ప్రభావం ఇలా..
చలికాలం నుంచి ఎండాకాలానికి, ఎండాకాలం నుంచి వర్షాకాలానికి.. సరిగ్గా రుతువు మారిన సమయంలో గులియన్ బారె సిండ్రోమ్ వచ్చే ఆస్కారం ఎక్కువ. కానీ సీజన్‌న్ మారినప్పుడు ఆ తీవ్రత మరింత అధికం అవుతుంది. జీబీఎస్ నేరుగా రోగి నరాలపై ప్రభావం చూపుతుంది. నరాలు మన శరీరంలోని వివిధ అవయవాలకు మధ్య విద్యుత్ తీగల్లా పనిచేస్తాయి. కనెక్టివిటీ ఇస్తాయి. ఎప్పుడైతే ఈ నరాలు దెబ్బతింటాయో.. విద్యుత్ ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా అవయవాలు మొరాయిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీబీఎస్ అనేది ఒక రకమైన నరాల వ్యాధి. మనిషిలోని ప్రతి అవయవాన్ని మెదడు నియంత్రిస్తుంది.. అయితే ఈ నరాలన్నిటిపైన శ్రీమైలిన్‌శ్రీ అనే పొర ఉంటుంది. కానీ, మైలిన్ పొర దెబ్బతిన్నప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నిలిచిపోతాయి. ఫలితంగా నరాలు దెబ్బతిని అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
నిర్లక్ష్యం చేస్తే...
వ్యాధిని మరింత నిర్లక్ష్యం చేస్తే ఛాతీ కండరాలు, ఊపిరి తిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాలు ప్రభావితం అవుతాయి. దాంతో ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా శ్వాస తీసుకోకపోతే రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. అప్పుడు, వెంటిలేటర్ అవసరం అవుతుంది. దీంతోపాటు గొంతు కండరాలు సైతం ప్రభావితం అవుతాయి. మాట్లాడటం, మింగడం కష్టమవుతుంది. రోగి చాలా ఇబ్బంది పడతారు.
ఎక్కువగా వీరిలోనే...
జీబీఎస్ అన్ని వయసుల వారినీ వేధిస్తుంది. కానీ ఎక్కువగా 25–45 ఏళ్ల లోపు వారికి, 50–65 ఏళ్ల లోపు వారిని లక్ష్యంగా పెట్టుకుంటుంది. డయేరియా, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు గురైనప్పుడు.. సమస్య వచ్చిపోయిన రెండు నుంచి నాలుగు వారాల తరువాత జీబీఎస్ దాడిచేసే అవకాశాలు ఉంటాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో సమస్య కొంత ఎక్కువగా ఉంటుంది. మగవాళ్లు ఎక్కువగా బయట తిరగడం, తరచూ ఇన్‌ఫెక్షన్ లకు గురి కావడమే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జిల్లా సమాచారం..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి – 1
ఏరియా ఆస్పత్రులు – 4
సీహెచ్‌సీలు – 8
పీహెచ్‌సీలు – 50
అర్బన్ హెల్త్ సెంటర్లు – 15
ప్రైవేటు ఆస్పత్రులు – 1500
లక్షణాలు ఇలా...
తీవ్ర బలహీనత
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు
ఒళ్లంతా మొద్దుబారడం
మెడ, ముఖం కండరాలు బలహీనపడటం
ఆహారం నమలడంలో ఇబ్బంది
కళ్లు తెరవడంలో సమస్యలు
ఊపిరి తీసుకోలేకపోవడం
ఆహారం మింగలేరు, మెడ కదపలేరు
లేచి నిల్చోలేకపోవడం
మల విసర్జన చేయలేకపోవడం
గుండెపోటుతో పాటు బీపీ పెరగడం
మూత్ర విసర్జన వ్యవస్థపై నియంత్రణ కోల్పోవడం
నిటారుగా నిలబడలేకపోవడం
ముందస్తు నివారణ చర్యలు
కాచి వడబోసిన నీరు తాగడం
పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడగడం
మాంసం 100 డిగ్రీల్లో ఉడికించి తినాలి
మలవిసర్జన ముందు, తర్వాత చేతలు శుభ్రంగా
కడ్కుకోవాలి
మొత్తానికి పరిశుభ్రంగా ఉండాలి
సకాలంలో వైద్యం చేయించుకోవాలి
కాళ్లల్లో బలం తగ్గపోయినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. జీబీఎస్ తీవ్రతరం అయితే శ్వాస సమస్య తలెత్తుతుంది. అప్పుడు, మెకానికల్ వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. మెకానికల్ వెంటిలేటర్‌తో ఇన్‌ఫెక్షన్‌న్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వెంటిలేటర్‌పై ఉండటం వల్ల కదలికలు ఆగిపోయి కాళ్లలో రక్తం గడ్డ కడుతుంది. గుండైపె ప్రభావం పడుతుంది. గుండె పనితీరు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇన్‌ఫెక్సన్‌లు రక్తంలోకి చేరుతోంది. సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకోవాలి. మూఢ నమ్మకాల జోలికి వెళ్లవద్దు. జ్వరం వస్తే కూడా తేలికగా తీసుకోవద్దు. – కల్యాణ్, న్యూరో సర్జన్, చిత్తూరు
భయపెడుతున్న జీబీఎస్ వైరస్
భయపెడుతున్న జీబీఎస్ వైరస్
Comments
Please login to add a commentAdd a comment