జిల్లాకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు. వీటిని జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
హాజరుకానున్న 30,713 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా 139 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి 30,713 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరంలో 15,639, ద్వితీయ సంవత్సరంలో 15,074 మంది విద్యార్థులు పరీక్షక్షలు రాయనున్నారు. పరీక్ష పత్రాలను 24, 25 తేదీల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు నడుమ జిల్లాలోని మండలాలకు సరఫరా చేయనున్నారు.
పర్యవేక్షించిన అధికారులు
జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలను అధికారులు పర్యవేక్షించారు. ఈ ప్రక్రియను ఇంటర్మీడియెట్ డీవీఈవో సయ్యద్ మౌలా, డీఎస్పీ సాయినాథ్ పీసీఆర్ జూనియర్ కళాశాలలో ప్రక్రియను పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూం వద్ద సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ హేమలత, దయానందరాజు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆదివారం జిల్లా కేంద్రానికి మొదటి సెట్ ఇంటర్ ప్రశ్నపత్రాలు విచ్చేశాయి. వాటిని పకడ్బందీగా భద్రపరిచాం.
– సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈఓ
Comments
Please login to add a commentAdd a comment