ఎంపీటీసీ సభ్యుడికి నివాళి
సదుం : అస్వస్థతతో మృతి చెందిన ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆనంద మృతదేహానికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి ఆదివారం నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బయ్యారెడ్డిగారిపల్లెలో మృతి చెందిన సంతోష్ (23) మృతదేహానికి నివాళి అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ధనుంజరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, నాయకులు బాబురెడ్డి, ఇమ్రాన్, పుట్రాజు, చిన్న రమణ, మల్‌రెడ్డి, రామాంజులు, ఎల్లారెడ్డి, వెంకటరమణాచారి, రవి, శివ, భాస్కర్,సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పొట్టెంవారిపల్లెలో పార్టీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పరామర్శించారు.
ఎంపీటీసీ సభ్యుడికి నివాళి
Comments
Please login to add a commentAdd a comment