బైక్‌లు ఎదురెదురుగా ఢీ
– ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి
గంగవరం : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన గంగవరం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. అర్బన్ సీఐ ప్రసాద్ కథనం మేరకు.. పెద్ద పంజాణి మండలం శివాడి గ్రామానికి చెందిన ప్రదీప్ (30) శంకర్రాయలపేట గ్రామంలో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొనుగోలుదారుల నుంచి బాకీ వసూళ్ల కోసం బుల్లెట్ వాహనంలో నాలుగు రోడ్ల కూడలికి బయలుదేరి వెళ్లి అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తున్నాడు. అదే విధంగా నాలుగురోడ్లు వద్ద ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉమేష్(31), బెంగుళూరు హొస్‌కోట వద్ద ఓ కంపెనీలో పనిచేస్తున్న అరుణ్(21) ఇద్దరూ అరుణాచలప్రదేశ్‌కి చెందినవారు. ఉమేష్‌ని కలుసుకోవడం కోసం అరుణ్ బెంగుళూరు నుంచి రాగా ఇద్దరూ కలిసి పల్సర్ బైక్‌లో ఎక్కడికో వెళ్లి తిరిగీ నాలుగురోడ్ల కూడలి వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలు వేగంగా వస్తూ సరమట్లపల్లి గ్రామం వద్ద ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బుల్లెట్‌లో వెళ్తున్న ప్రతాప్, అరుణాచలప్రదేశ్‌కు చెందిన ఉమేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా అరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సీఐ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిన పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
బైక్‌లు ఎదురెదురుగా ఢీ
Comments
Please login to add a commentAdd a comment