పర్మినెంట్ కిక్కు
● మద్యం దుకాణాల్లో అనధికార పర్మిట్ గదులు ● బార్లకు సమాంతరంగా మద్యం దుకాణాల గదులు ● ‘పర్మిట్’ ఆదాయంలో ఎకై ్సజ్ , ఖాకీలకు వాటాలు ● ఆపై కూటమి నేతలకు సగటున 7 శాతం మామూళ్లు ● నగరి నుంచి కుప్పం వరకు ‘మద్యం’ గదుల్లో దందా
రూ.18.46 కోట్లు
రూ.52 లక్షలు
రూ.8.12 కోట్లు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరం ఒక్కటే కాదు.. జిల్లాలోని తమిళనాడు సరిహద్దులో ఉన్న నగరి నుంచి కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గం వరకు ప్రతి ఒక్క మద్యం దుకాణం వద్ద పర్మిట్ గదులు దర్శనమిస్తుంటాయి. వీటికి ఏవైనా అనుమతులు ఉన్నాయా..? రాష్ట్రంలో అసలు పర్మిట్ గదులు పెట్టుకోవడానికి అనుమతులే ఇవ్వలేదు. అనధికారికంగా బార్లకు సమాంతరంగా మద్యం దుకాణాల వద్దే పర్మిట్ గదులు కనిపిస్తున్నాయి. ఈ పర్మిట్ గదులే కూటమి నేతల నుంచి ఎకై ్సజ్, పోలీసు అధికారులకు మామూళ్లు వర్షం కురిపిస్తున్నాయి.
ఆదాయం ఇలా..
చిత్తూరు నగరం, పలమనేరు, నగరి, కుప్పం పట్టణాల్లోని మద్యం దుకాణాల వద్ద ఒక్కో పర్మిట్ గది వద్ద రోజుకు సగటున రూ.30 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. మద్యం తాగే డిస్పోజబుల్ గ్లాసు నుంచి మాంసాహార వంటలు, కూల్ డ్రింకులు, టిఫెన్లు అన్నీ ఇక్కడే లభ్యమవుతున్నాయి. పల్లెల్లో ఉన్న పర్మిట్ గదుల్లో సగటున రూ.10 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. జిల్లా మొత్తంగా ఉన్న మద్యం దుకాణాల వద్ద 350 వరకు పర్మిట్ గదులు ఉంటే.. మద్యం విక్రయాలు, గదుల్లో జరిగే వ్యాపారాల ద్వారా నెలకు దాదాపు రూ.18 కోట్లకు పైనే లాభాలు వస్తున్నాయి.
ఎవరి వాటా వాళ్లదే..
పర్మిట్ గదులు వెలసినచోట.. మరే వ్యాపారం చేయడానికి వీలుండదు. వస్త్ర దుకాణాలు, హోటళ్లు, పానీపూరి దుకాణాల్లాంటి వాటిని ఇక్కడ కొనసాగించే ప్రసక్తే లేదు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు నిత్యం గొడవలు పడటం, తాగి అక్కడే వాంతులు చేసుకోవడం, పడిపోవడం సర్వ సాధారణం. ప్రతి పర్మిట్ గదికి ఎకై ్సజ్, ఖాకీలు కప్పం వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత మద్యం దుకాణ నిర్వాహకుడిదే. వచ్చిన దాంట్లో ఎకై ్సజ్ అధికారులు ఒక్కో దుకాణానికి రూ.30 వేలు, పోలీసులు రూ.20 వేల వరకు పంచుకుంటున్నారు. పల్లెల్లోని దుకాణాలకు కాస్త మినహాయింపు ఇస్తూ రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు.
‘చిత్తూరు నగరంలోని పాత బస్టాండు సమీపంలో ఉన్న మద్యం దుకాణం. ఈ దుకాణం మిద్దైపెన పర్మిట్ గది నడుస్తోంది. దీనికి మూడు పక్కల ఉన్న దుకాణాల్లో ఎక్కడైనా సరే కూర్చుని మద్యం తాగే వెలుసుబాటు ఉంది. స్టప్‌కు ఏది కావాలంటే అది నిమిషాల్లో తయారు చేసి ఇస్తారు. రోజుకు రూ.30 వేల ఆదాయం సమకూరుస్తున్న అనధికారిక పర్మిట్ గదుల విషయం జిల్లా ఎకై ్సజ్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు తెలుసు. చర్యలు తీసుకోరా..? అంటే మౌనమే సమాధానం.’
కూటమి నేతను చేర్చుకోవాల్సిందే..
మద్యం దుకాణాలున్న నియోజకవర్గంలో వాటి యజమానులకు ఇష్టం ఉన్నా లేకున్నా కూటమి పార్టీ నేతలను వాటాదారుడిగా చేర్చుకోవాల్సిందే. వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడి పెట్టని కూటమి నేతలు 5 నుంచి 7 శాతం వరకు.. అంటే నెలకు రూ.8 కోట్ల పైనే లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ మాత్రం కిక్కులేకుంటే కష్టమే మరి.
పర్మినెంట్ కిక్కు
Comments
Please login to add a commentAdd a comment