జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌ కేసుల సంఖ్య నవంబర్‌–2024 5,289 డిసెంబర్‌–2024 4,640 జనవరి–2025 4,425 ఫ్రిబవరి–2025 3,502 | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌ కేసుల సంఖ్య నవంబర్‌–2024 5,289 డిసెంబర్‌–2024 4,640 జనవరి–2025 4,425 ఫ్రిబవరి–2025 3,502

Published Wed, Feb 26 2025 8:38 AM | Last Updated on Wed, Feb 26 2025 8:35 AM

జిల్ల

జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌ కేసుల సంఖ్య నవ

కాణిపాకం : స్క్రబ్‌ టైఫస్‌ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ బుష్‌ టైఫస్‌ అని పిలుస్తారు.. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్‌ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. కీటకం కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియ్‌ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్‌ టైఫస్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కువగా ఈ వ్యాధి బారీన పడుతారు. చెట్లు, పొలాల్లో ఉండే ఈ కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపు తాయి. కొందరికి వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుందని, మరికొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారి శరీరం పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది.

అవగాహన లేకపోవడం

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ జ్వర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు, పూతలపట్టు, గుడిపాల మండలాల్లో పలువురికి స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు కనిపించాయి. గతేడాది ఈ తరహా జ్వరంతో కొందరు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అంతటి ప్రమాదకరమైన వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. జిల్లాలో సోకుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్‌ టైఫస్‌ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్ష కిట్లు లేవు...

ఈ వ్యాధి నిర్ధారణకు వెయిల్‌ ఫెలిక్స్‌ పరీక్ష, ఇన్ఫ్రారెక్ట్‌ ఇమ్యూనో ఫ్లోరోసెంట్‌ యాంటీబాడీ (ఐఎఫ్‌ఎ) పరీక్ష, ఇన్ఫ్రారెక్ట్‌ ఇమ్యూనో పెరాకై ్సడేజ్‌ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్‌ టెస్ట్‌ (ఐసీటీ), పీసీఆర్‌ పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లలో దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీ బయాటిక్‌ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అందుకే ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు గుర్తిస్తారు. ఈ వ్యాధి నిర్ధారణకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి కిట్లు, పరీక్షలు లేవని వైద్యులే చెబుతున్నారు.

వ్యాధి వ్యాప్తితో అవయవాలపై ప్రభావం

u

వ్యాధి లక్షణాలు ఇలా..

అధిక జ్వరం

తీవ్రమైన చలి

పొడిదగ్గు

తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, నీరసం

ఎరుపు మచ్చలు లేదా శరీరంపై దద్దుర్లు

ముదిరితే కామెర్లు, ఫిట్స్‌ లక్షణాలు

కోరలు చాస్తున్న స్క్రబ్‌ టైఫస్‌

జిల్లాలో క్రమంగా పెరుగుతున్న టైఫస్‌ కేసులు

జ్వరమని తేలికగా తీసుకుంటున్న జనం

నిర్లక్ష్యం చేస్తే అవయవాలపై తీవ్ర ప్రభావం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో టైఫస్‌ పరీక్షలు శూన్యం

నిర్లక్ష్యం చేయొద్దు

జ్వరం రెండు, మూడు రోజులు ఉంటే పర్వా లేదు. దానికి మించి జ్వరం ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. పలు పరీక్షలు చేసుకుని జ్వర కారణాలను నిర్ధారణ చేసుకోవాలి. వీటిని లెక్క చేయకుండా రెండు మందు బిల్లలు మింగితే తగ్గిపోతుందని తేలికగా తీసుకోవద్దు. జ్వరం ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తుంది. ఆ రకంలో ఈ స్క్రబ్‌ టైఫస్‌ ఒకటి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై మచ్చలను గమనించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో స్క్రబ్‌ టైఫస్‌ను గుర్తించి చికిత్స తీసుకోవాలి.

– డాక్టర్‌ అశోక్‌కుమార్‌, పల్మోనాలజిస్ట్‌, క్రిటికల్‌ కేర్‌ ఫిజీషియన్‌, చిత్తూరు

న్యూమోనైటీస్‌

తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం

ఎక్యుట్‌ రెస్పిరేటరీ డిస్ట్సెస్‌ సిండ్రోమ్‌ ప్రభావం

కిడ్నీలు ఫెయిల్యూర్‌ కావడం

హృదయ కండరాల వాపు

సెప్టిక్‌ షాక్‌ అంతర్గత రక్తస్రావం

తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం

కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితి చూపడం

సకాలంలో గుర్తించి వైద్యం పొందితే బయటపడొచ్చునని వైద్యుల సూచన

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌  కేసుల సంఖ్య నవ1
1/2

జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌ కేసుల సంఖ్య నవ

జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌  కేసుల సంఖ్య నవ2
2/2

జిల్లాలో ఫీవర్‌ కేసులు ఇలా.. నెల ఫీవర్‌ కేసుల సంఖ్య నవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement