టీడీపీ నేతల లాటరీ గుట్టు రట్టు
● లాటరీ డెన్‌పై పోలీసుల దాడి
● పన్నెండు మంది పట్టివేత
పలమనేరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలమనేరు అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ సాగే లాటరీ వ్యాపారాలను ఓ యువనేత లీడ్ చేస్తూ పేదల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నాడంటూ గతనెల సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై పోలీసు నిఘా విభాగాలు కన్ను పెట్టాయి. ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణంలోని మదనపల్లి రోడ్డు గుండుబావి సమీపంలో లాటరీ ఆఫీస్‌నే నిర్వహిస్తున్న నిందితులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 20వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి లోకనాథ ఆచారితోపాటు అతని తండ్రి సుబ్రమణ్యం ఆచారి, సోదరుడు యుగంధరాచారి, నారాయణస్వామి, శశిధర్, షంషీర్, శివకుమార్, మహ్మద్‌వాజిద్‌తోపాటు గంగవరానికి చెందిన మరో నలుగురిని అరెస్ట్ చేసి.. వీరినుంచి రూ.8,500 , సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు తమిళనాడు, కేరళ తదితర అంతర్రాష్ట్ర లాటరీ నిర్వాహకులతో సంబంధాలున్నట్లు విమర్శలున్నాయి. కాగా టీడీపీ నేతల ప్రమేయం ఉన్నందున ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment