‘పచ్చ’ గుప్పిట్లో ఫారెస్టు భూములు
● యథేచ్ఛగా 70 ఎకరాలు ఆక్రమణ
వడమాలపేట (విజయపురం) : మండలంలోని బాలినాయుడు కండ్రిగ పంచాయతీ బంగారెడ్డి కండ్రిగ సమీపంలోని అటవీ ప్రాంతంలోని గుట్ట పొరంబోకుతో పాటు రిజర్వు ఫారెస్టు భూములను స్థాని క టీడీపీకి చెందిన ఓ నేత యథేచ్ఛగా ఆక్ర మించుకొని మామిడి తోట సాగు చేసు కుంటున్నాడు. గతంలో వీటిని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఆ పచ్చ నేతపై కే సు నమోదు చేసి అరెస్టు వారెంట్ ఇచ్చా రు. అరెస్ట్ వారెంట్ ఉన్నా అధికారులు చూసీ చూడన ట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలు మితి మీరిపోవడం సుమారు 70 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని యంత్రాలతో చదును చేసి ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఎస్టీ కాలనీ వాసులు మీడియా ముందుకు వ చ్చారు. జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఎకరాలకు ఎకరాలు అటవీ భూముల ను ఆక్రమించుకోవడమే కాక ఎస్టీలకు చెందిన శ్మశాన స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్ట పొరంబోకు స్ధలాన్ని కబ్జా చేసి ఇష్టారాజ్యంగా పంచు కుంటున్నారని తెలిపారు. ఈ భూమి ఎకరం రూ.కోటి పలుకుతుందన్నారు. 30 కుటుంబాల ఎస్టీలకు సెంటు భూమి కూడా లేదని, అయితే పెద్ద రైతులు ఎకరాలకు ఎకరాలుగా భూములు ఆక్రమించుకొంటున్నారని వా పోయారు. ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుని తమకు జీవనోపాధి నిమిత్తం పట్టాలివ్వాలని ఎస్టీ కా లనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలను అ డ్డుకోకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే మీడియాకు సమాచారం అందించిన విషయం తెలియడంతో పచ్చనేత ఎస్టీ కాలనీ వాసులపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
‘పచ్చ’ గుప్పిట్లో ఫారెస్టు భూములు
‘పచ్చ’ గుప్పిట్లో ఫారెస్టు భూములు
Comments
Please login to add a commentAdd a comment