కోతల పింఛన్
గజ వాహనంపై మల్లన్న
బంగారుపాళెం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారు గజవాహనంపై దర్శనమిచ్చారు.
కొత్త పింఛన్ రాక పాయే.. ఉన్నవి ఊడిపాయే !
● జిల్లాలో కొత్త పింఛన్‌ల కోసం ఎదురుచూపులు ● వేల పింఛన్‌లు తొలగించిన కూటమి ప్రభుత్వం ● నలుగురికి పింఛన్‌లు ఇచ్చేందుకు రూ.40 లక్షలకు పైగా ఖర్చు ● నేడు జీడీ నెల్లూరు పర్యటనకు రానున్న సీఎం చంద్రబాబు
●
నేడు సీఎం రాక
జీడీ నెల్లూరు: పింఛన్ల పంపిణీకి శనివారం జీడీ నెల్లూరుకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
చిత్తూరు కలెక్టరేట్ : సూపర్ సిక్స్ హామీలిచ్చారు.. ఇంకా వాటిని ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కూటమి టీడీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్‌లలో కోత విధిస్తూనే ఉన్నారు. జిల్లాలో ఏళ్ల తరబడి ప్రతినెలా ఠంఛన్‌గా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారులకు ‘మీ పింఛను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైంది’ అంటూ అధికారులు నోటీసులు జారీ చేసి కోతల ప్రక్రియ చేపట్టారు. పింఛన్‌దారులకు పార్టీల రంగు పులిమి తొలగింపు చేపట్టారు. 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాల తరహాలోనే ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వంలోనూ అధికార పార్టీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్ చేస్తున్నారు.
కూటమి నేతల జోక్యం
టీడీపీ–జనసేన –బీజేపీ కూటమి ప్రభుత్వం జులైలో తొలిసారి పింఛన్లు పంపిణీ చేసింది. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం కొనసాగినా, ప్రతి చోటా పంపిణీ మొత్తం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలోనూ 2014–19 మధ్య వృద్ధులు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల పంపిణీలో ప్రతి అంశంలోనూ అప్పటి అధికార టీడీపీకి సంబంధించిన జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం విపరీతంగా కొనసాగిన విషయం తెలిసిందే. 2019 తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు మొదలు, పంపిణీలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి జోక్యం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంతృప్తి స్థాయిలో పథకం అమలు కొనసాగిన విషయం తెలిసిందే. గత ఐదేళ్ల పరిస్థితికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తుండడం గమనార్హం. మరికొన్ని ప్రాంతాల్లో తమకు ఓటు వేయలేదన్న కారణంతో పింఛను డబ్బు ఇవ్వకుండా నిలిపివేశారు.
నలుగురికి సీఎం చేతుల మీదుగా పింఛన్‌లు..
జిల్లాలోని గంగాధర నెల్లూరులో శనివారం సీఎం చంద్రబాబు పర్యటన సాగనుంది. మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 12.40 గంటల వరకు పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అధికారులు ముందస్తుగా ఎంపిక చేసిన నలుగురు లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా పింఛన్‌లు అందజేయనున్నారు. నలుగురు లబ్ధిదారులకు పింఛన్‌లు అందజేసేందుకు దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసి జిల్లా పర్యటనకు రావడం అవసరమా అని పలువురు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్ జగన్ ఒకేసారి లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ నగదు జమ చేశారని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కోసం ప్రతి నెలా నలుగురికి ఆయన చేతుల మీదుగా పింఛన్‌లు అందిస్తున్నారని జిల్లావాసులు వెల్లడిస్తున్నారు.
ఎన్‌సీడీ తప్పుల తడకపై విచారణ
చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఎన్‌సీడీ తప్పుల తడకపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘సాక్షి’ దినపత్రికలో బతికుండగానే మృతుల జాబితాలోకి అనే శీర్షికన ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురంలో విచారణకు దిగారు. బాధితుడి ఇంటి వద్దకు ఆశా కార్యకర్తను పంపారు. వారు బతికి ఉన్నారా..అనే విషయంపై ఆరా తీశారు. తప్పు జరిగిందని.. ఆ తప్పు మాకు ఎలా జరిగిందో తెలియదని తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఆ సర్వేలో జరిగిన లోటుపాట్లను జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరు సిబ్బందికి తాఖీదులు ఇచ్చారు.
గుడుపల్లి ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గుడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణానాయుడుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్మీడియట్ డీవీఈవో సయ్యద్ మౌలా ప్రిన్సిపల్‌కు నోటీసులు పంపారు. గుడిపాల ప్రభు త్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధు లు నిర్వహిస్తున్న రామకృష్ణానాయుడు పరీక్ష ల విధుల పట్ల అలసత్వం వహించారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన కార్యాలయ మెటీరియల్ మామి డి తోటలో లభ్యం అయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వ్యాపించింది. ఈ ఘటన పై ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీచేసినట్లు డీవీఈవో పేర్కొన్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం..
ఆర్డీ విచారణ
పుత్తూరు : అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్ట 2021 మే 18వ తేదీన కుంగింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ పుత్తూరు ప్రజలు భయాందోళన చెందారు. ఈ సంఘటన సమయంలో అనారోగ్యంతో చైన్నె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ నాటి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జిల్లా అధికారులను అప్రమత్తం చేసి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. దీంతో పుత్తూరు ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. దీనిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం ఆనాటి మరమ్మతు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆర్డీని విచారణకు ఆదేశించారు. దీంతో అనంతపురం రీజనల్ డైరెక్టర్ పి.విశ్వనాథ్ శుక్రవారం పుత్తూరు మున్సిపాలిటీకి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఇదివరకే ఆడిట్ జరిగిందని, అయినా పై అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నామని, ఏదైనా జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరతామని తెలిపారు.
నిమిషం ఆలస్యమైనా బయటికే!
● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్ అధికారులు పకడ్బందీ ఏ ర్పాట్లు చేపట్టారు. మార్చి1న మొదటి సంవత్సరం విద్యార్థులకు, 3న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. జిల్లాకు చేరిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. మొత్తం 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 30,652 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు చేరాయి. రోజూ ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 8 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షల సమయంలో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఎవరైనా 08572–293867 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారు అధికార నందిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారు కామధేనువుపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
నేడు సభాపతి కల్యాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం సభాపతి కల్యాణం నిర్వహించనున్నారు. నటరాజస్వామికి శివకామి సుందరితో కల్యాణం నిర్వహించనున్నారు. సభాపతి కల్యాణం జరిగే రాత్రిని ఆనందరాత్రిగా వ్యవహరిస్తారు.
న్యూస్‌రీల్
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి
నుంచి తగ్గుతున్న పింఛన్‌లు
2024 జులై నెలలో 548
ఆగస్టు 634
సెప్టెంబర్ 1,513
అక్టోబర్ 2,819
నవంబర్ 3,670
డిసెంబర్ 3,847
2025 జనవరి 4,598
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్లకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో పేదలు, దివ్యాంగులు పొందుతున్న పింఛన్లలో కోత విధించారు. మరి కొంత మంది పింఛన్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. కొత్త పింఛన్‌ల కోసం ప్రజలు గ్రీవెన్స్‌లో అర్జీలు అందజేస్తూనే ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు, పింఛన్‌లను అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం నలుగురు లబ్ధిదారులకు పింఛన్‌లు ఇచ్చేందుకు ఆర్భాటం చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శనివారం గంగాధర నెల్లూరు పర్యటనకు విచ్చేస్తున్నారు.
పింఛన్ ఇవ్వడం లేదు....
నాకు అంగవైకల్యం ఉంది. వృద్ధాప్యం పైబడుతోంది. అంగవైకల్యం వల్ల ఎలాంటి జీవనోపాధి లేదు. 63 శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంది. పింఛన్‌కోసం గత ఏడాది నవంబర్ 28వ తేదీన కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చాను. కొత్త పింఛనుకు ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియడం లేదు.
– విమల, దివ్యాంగురాలు, గంగాధర నెల్లూరు మండలం
కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నా..
మాది బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి గ్రామం. పూర్తి అంగవైకల్యం ఉండడం వల్ల నడవలేని పరిస్థితి. ఎటువంటి ఉపాధి లేదు. కొత్త పింఛన్‌కు అవకాశం కల్పిస్తే అప్పుడు దరఖాస్తు చేసుకోవాలంటున్నా. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా చెప్పడం లేదు.
– లక్ష్మప్ప, దివ్యాంగుడు, బైరెడ్డిపల్లి మండలం.
అర్హత ఉన్నా ఇవ్వలేదు..
మాది తవణంపల్లి మండలం కుయ్యవంక ఎస్టీ కాలనీ. వృద్ధాప్య పింఛన్ కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నాను. మండల అధికారుల వద్దకు వెళ్లి అడిగితే నోరు మెదపడం లేదు. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాను. ఇంత వరకు న్యాయం చేయడం లేదు. – గంగులమ్మ,
వృద్ధురాలు, తవణంపల్లి మండలం.
ఎప్పుడిస్తారు సారూ..
మాది కార్వేటినగరం మండలం సుద్ధగుంట గ్రామం. నా వయస్సు 80 సంవ త్సరాలు. నాకు ఐదు నె లలకు ముందు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఉన్నట్టుండి ఆ పింఛన్ ఇవ్వడం మానేశారు. ఎందుకు ఇవ్వ డం లేదని మండల అధికారుల దగ్గరకు వెళ్లి చాలా సార్లు అడిగాను. వారేమో ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. – మునెమ్మ, వృద్ధురాలు, కార్వేటినగరం
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
కోతల పింఛన్
Comments
Please login to add a commentAdd a comment