అధికారులు బాధ్యతగా పనిచేయాలి
చిత్తూరు కార్పొరేషన్ : మండల కేంద్రాల్లో అధికారులు బాధ్యతగా పనిచేయాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు హెచ్చరించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ కార్యాలయ, జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయ ఏఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నెలకు 2 సార్లు ఎం–బుక్‌లను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. ఎంబుక్‌లను ఉద్యోగులు జెడ్పీకి తీసుకురావాలని, కాంట్రాక్టర్లతో పంపరాదన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల ప్రారంభానికి ముందు, పూర్తయ్యాక ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఆకస్మికంగా ఎంపీడీఓ కార్యాలయాలకు తనిఖీలకు వెళ్లినప్పుడు పలు విషయాలు తెలుస్తున్నాయన్నారు. కార్యాలయంలో ఒకరి పైనే పని ఒత్తిడి పడుతోందన్నారు. కొందరు పనులు చేయకుండా సాకులు చెబుతున్నట్లు తెలుస్తోందన్నారు. కొందరు పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారని, మరికొందరు కంప్యూటర్ పరిజ్ఙానం లేదని ఏదో సాకులు కాలయాపన చేస్తున్నారన్నారు. ఇంక పలువురికి ఈ–ఆఫీసు మీద పరిజ్ఙానం లేదన్నారు. విధి నిర్వహణలో కక్కుర్తి పడి తప్పులు చేస్తే ఎప్పటికై న శిక్ష అనుభవించక తప్పదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జుబేదా తదితరులు పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
Comments
Please login to add a commentAdd a comment