ఆటగదరా శివ..
● గత ఏడాది శివరాత్రిన భర్తను ఏమార్చి.. ప్రియడితో వెళ్లిన వివాహిత ● మళ్లీ ఈ ఏట శివరాత్రి ఉత్సవాలలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ
ఇప్పుడేమైందంటే...
నాడు శివరాత్రి జాగారణకు గుడికి వెళ్లి వస్తానని భర్తను ఏ మార్చి ప్రియుడితో వెళ్లి ఓ సైకో ను చంపి ఆపై ఆరునెలలు జైల్లో ఉండి బెయిల్‌పై వచ్చిన కోమల ఆపై తన ఇరువురు బిడ్డలను బాగా చూసుకుంటూ భర్తతో కలసి ఇకపై ఎలాంటి తప్పులు చేయకుండా జీవనం సాగించింది. సోమవారం ఉదయం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆమె మనస్తాపానికి గురై పక్కనే ఉన్న జల్లిపేట చెరువులో ఆత్మహత్య చేసుకొంది. స్థానిక ఫైర్ సిబ్బంది ఆమె మృతదేహాన్ని వెలుపలికి తీశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇలా ఉండగా గత శివరాత్రి నుంచి ఈ శివరాత్రిలోపు జరిగిన ఘటనలను గమనించిన స్థానికులు కర్మ సిద్దాంతం ఉందయ్యా శివయ్యా అంటూ జనం చర్చించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
పలమనేరు : కర్మ సిద్ధాంతం ఉందనే మాట మళ్లీ జనానికి గుర్తు చేసిన ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) ఇంట్లో గొడవ జరిగి రెండు రోజుల కిందట జల్లిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది. వీరికి వివాహం జరిగి ఏడేళ్లు అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం ఉదయం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆమె మనస్తాపానికి గురై పక్కనే ఉన్న జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది సాధారణ ఆత్మహత్య అనుకుంటే పొరబాటే. దీని వెనుక ఏడాది కిందట శివరాత్రి నాటి కథ తెలియాల్సిందే.
గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే...
గడ్డూరుకు చెందిన కోమల ఇదే మండలంలోని కొలమాసనపల్లికి చెందిన ప్రియుడు గౌతం(26)తో కలిసి వెళ్లేందుకు శివరాత్రి జాగరణ పేరిట గుడికి వెళుతున్నానంటూ భర్తను నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంటి బయట బైక్‌పై ఉన్న ప్రియుడితో కలసి గడ్డూరు నుంచి పట్టణ సమీపంలోని జగమర్ల అడవిలోకి వెళ్లారు. అడవిలోకి ఎవ రైనా ప్రేమికులు కలుసుకొనేందుకు వస్తే వారిని బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్‌ఫోన్లు చోరీ చేసి మహిళలను రేప్ చేయడంతో ఓ సైకో దిట్ట, ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోమల, గౌతం అడవి లో ఉండగా చెట్టుపై మాటువేసిన సైకో వినయ్ వీరిని బెదిరించాడు. డబ్బు, మహిళపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలన్నాడు. అందుకు వారు అడ్డం తిరగ్గా తన వద్దనున్న రాడ్‌తో కొట్టేందుకు గౌతంను చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో గౌతం అక్క డున్న బండరాయితో వినయ్‌పై పడేశాడు దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఆపై ఏమీ తెలియనట్లు వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం మూడురోజుల తర్వాత వెలుగు చూసింది. ఇదే సమయంలో తామే హత్య చేశామంటూ కో మల, గౌతం స్థానిక పోలీసుల వద్దకు రావడంతో మొత్తం విషయం బయటపడింది. మృతుడు పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్ (30) గా పోలీసులు గుర్తించారు. ఇలా ఉండగా శివాడి గ్రామానికి చెందిన శివశంకర్ కుమారుడైన వినయ్ గత కొన్నేళ్ల నుంచి చెడు వ్యసనాలకు బానిసై సంచార జీవనం సాగిస్తూ గంజాయి అక్రమరవాణా, చోరీలకు పాల్పడేవాడు. ఇతనిపై గంగవరంతో పాటు కర్ణాటకలోని పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సైకోగా మారిన వినయ్ పట్టణ సమీపంలోని జగమర్ల అడవిలో పగలు, రాత్రి ఉంటూ ఏకాంతం కోసం అక్కడికి వెళ్లే ప్రేమికులను బెదిరించడం చేసేవాడు. ఈ నేపథ్యంలో వీరిని బెదిరించడం జరిగి ఆపై గొడవల్లో ప్రేమికుల చేతుల్లో ఇతను హత్యకు గురయ్యాడు.
ఆటగదరా శివ..
Comments
Please login to add a commentAdd a comment