వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఆలయాలకు పూర్వవైభవం
పుంగనూరు : పురాతన ఆలయాల అభివృద్ధి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిదేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నెక్కుందిలోని శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. నెక్కుంది సోమల మండలంలోని దుర్గంకొండలో, చౌడేపల్లె మండలంలో బోయకొండ, మృత్యుంజయేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, దేవళంపేటలోని పురాతన ఆలయాలకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే దేవళంపేట, పుంగనూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, చౌడేపల్లె మండలంలోని రాజనాల బండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట అనీషారెడ్డి, శ్రీనాధ్‌రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెమ్మ, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment