స్వచ్ఛత పాటించాలి : డీఆర్‌ఓ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని డీఆర్‌ఓ మోహన్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ.. ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రాంగణాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని చెప్పారు. అనంతరం స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమయం కేటాయించాలి..
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు సమయం కేటాయించాలని సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. శనివారం డీఈఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. తమ వంతు కృషి గా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment