
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికా కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్ సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. దీంతో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి.
దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ సిటీలోని లికోయిన్ అవెన్యూ ఆఫీస్ భవనం రెండవ అంతస్తులో షూటింగ్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారి జెన్నిఫర్ అమాత్ తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారన్నారు. పోలీసు అధికారులు అనుమానుతుడిపై జరిపిన కాల్పుల్లో స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో అతనికి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ జెన్నిఫర్ అమత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment