పెళ్లి పేరుతో సీరియల్‌ నటి మోసం | Serial Actress Aishwarya Addala Cheats Her Husband Shyam Kumar, Deets Inside - Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో సీరియల్‌ నటి మోసం

Published Tue, Mar 12 2024 8:04 AM | Last Updated on Tue, Mar 12 2024 10:17 AM

actress aishwarya addala cheats husband - Sakshi

సీతంపేట : అత్తారింటికి దారేది, పలుకే బంగారమాయే సీరియల్‌ ఫేం అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్‌కుమార్‌ ఆరోపించాడు. పెళ్లికి ముందే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుందన్నారు. ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో సోమవారం శ్యామ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్‌ ద్వారా పెద్దలు సంబంధం కుదర్చడంతో 2023 సెప్టెంబర్‌ 6న విశాఖలో ఐశ్వర్యతో తనకు పెళ్లి జరిగిందని తెలిపారు. అక్టోబర్‌ 7న హైదరాబాద్‌లో ఐశ్వర్య ఇంటికి వెళ్లామని, అయితే ఆ ఇంట్లో ఆమె స్నేహితుడు డ్రింక్‌ చేస్తూ కనిపించాడన్నారు. దీంతో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు.

 మరుసటి రోజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కరణం రమేతో ఐశ్వర్య ఉండటం చూశానని, నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఐశ్వర్య తల్లిదండ్రులు తనను బలవంతంగా విశాఖ పంపేశారని వెల్లడించాడు. ఆ తర్వాత కరణం రమేష్‌ తనకు ఫోన్‌ చేసి ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని, లేదంటే గొడవలు జరుగుతాయని హెచ్చరించాడన్నారు. విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళితే.. కట్నం కోసం తన కుటుంబం వేధిస్తున్నట్టు పెందుర్తి పోలీసుస్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.

 వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తిరిగి తన కుటుంబంపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని శ్యామ్‌కుమార్‌ కోరాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారని ఆరోపించాడు. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులకు తామే డబ్బులు ఇచ్చామని తెలిపాడు. మీడియా సమావేశంలో శ్యామ్‌కుమార్‌ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement