జైపూర్: రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంబామాత ఎస్పీని ఆశ్రయించిన బాధిత మహిళ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ ఉద్యోగం ఇప్పిస్తానని తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని భీల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సుఖేర్‌లో 10 నెలల క్రితం ఇదే ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సీఐడీ విచారణ కొనసాగుతోంది.
తాజా కేసులో మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఉద్యోగం కోసం ప్రతాప్ భీల్ తనను కలిసిన తర్వాత తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని మహిళ పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి అతడు తనకు ఏదో ఓ పని మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడని, గతేడాది మార్చిలో ఆ ఎమ్మెల్యే తన ఇంటికి చేరుకుని తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని కూడా హామీ ఇచ్చాడని చెప్పింది.
కాగా, గోగుండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆయనపై పది నెలల్లో లైంగిక దాడి కేసు నమోదు కావడం ఇది రెండోసారి. అయితే ఈ రెండు కేసుల్లో మాహిళల ఫిర్యాదుల్ని గమనిస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెళ్లి పేరుతో వంచించి ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళలు ఆరోపించారు. కాగా ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment