
ప్రతీకాత్మక చిత్రం
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు కనిపించాయి. హోటల్ నిర్వాహకుడిని నిలదీస్తే సరైన సమాధానం రాక పోవడంతో బాధితుడు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన శివ అనే యువకుడు బుధవారం కమలానగర్‌లోని లక్ష్మీనరసింహా పొంగనాల హోటల్‌కు వెళ్లాడు.
చదవండి: ఒకదానిపై ఒకటి రైలు బోగీలు.. జనం పరుగులు.. అసలేం జరిగింది?
రూ.200 చెల్లించి పది ప్యాకెట్లు తీసుకెన్నాడు. తిరిగి వచ్చి కార్యాలయంలో స్నేహితులతో కలిసి పొంగనాలు తింటుండగా రెండు తాగిపడేసిన సిగరెట్ పీకలు కనిపించాయి. వెంటనే హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లగా, సరైన సమాధానం రాక పోవడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment