డీఎస్పీ స్రవంతిరాయ్, పక్కన సీఐ కోటేశ్వరరావు, సర్కిల్‌లో నిందితురాలు
తెనాలి రూరల్: అత్త హత్య కేసులో కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పారడైజ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఆగస్ట్ 28వ తేదీ తాడికొండ మైథిలి (53) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు మైథిలి కోడలు రాధాప్రియాంక అలియాస్ ప్రియ అలియాస్ పూజగా గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె.స్రవంతిరాయ్ వెల్లడించారు.
చదవండి: కర్నూలులో భక్షక భటుడి లీలలు.. క్రైంపార్టీ ముసుగులో..
అత్త వేధింపులు తాళలేక క్షణికావేశంలో ఆమెను కోడలు పూజ హత్య చేసిందని తెలిపారు. ఇంట్లో నిద్రిస్తున్న మైథిలిపై కూరగాయలు కోసే చాకుతో పొడిచి, చపాతి కర్రతో దాడి చేసి హత్యకు పాల్పడిందని, హత్య చేసిన అనంతరం నిందితురాలు విజయవాడ వెళ్లిపోయిందని డీఎస్పీ చెప్పారు. నిందితురాలి ఆచూకీని గుర్తించి సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. హత్యకు వినియోగించిన చాకు, చపాతి కర్రను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. సమావేశంలో టూటౌన్ సీఐ బి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
చదవండి: Vizianagaram: ట్రైనింగ్‌కు వచ్చిన మహిళా ఎస్సై ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment