
న్యూఢిల్లీ : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతయుత వృత్తిలో ఉండి చేస్తున్న పనికే కలంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్దుడు. ధర్మానికి అండగా నిలవాల్సిన పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మహిళను టార్గెట్ చేస్తూ వారిపై వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బండారం బయటపడి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాలు.. గత కొద్ది రోజులుగా పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళలను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నంబర్ ప్లేట్ లేకుండా ఓ వ్యక్తి కారులో ఒంటరిగా తిరుగుతూ, బాలికలు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ నటి అరెస్ట్
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ద్వారక ప్రాంతంలో పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటన స్థలంలో వ్యక్తి ఉపయోగించిన కారు ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు జనక్‌పురికి చెందిన పునీత్ గరేవాల్ ఢిల్లీలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తేలింది. నిందితునిపై ఏపీసీ సెక్షన్లు 354డీ,354 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మాజీ మంత్రికి మూడేళ్లు జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment