వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు | Fake Insurance For Vehicles In Guntur District | Sakshi
Sakshi News home page

వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు

Published Sat, Apr 10 2021 2:03 PM | Last Updated on Sat, Apr 10 2021 4:31 PM

Fake Insurance For Vehicles In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. జిల్లాలో కొందరు ముఠాలుగా ఏర్పడి ఆపత్కాలంలో భరోసా ఇచ్చే వాహన బీమాల్లో నకిలీ దందా కొనసాగిస్తున్నారు. రవాణాశాఖకు సైతం అనుమానం రాకుండా నకిలీ బీమా సర్టిఫికెట్ల వ్యవహారం సాగిపోతోంది. గత ఏడాది అక్టోబర్‌ రెండో తేదీ ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్‌ వంతెనపై నిబంధనలకు విరుద్ధంగా ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఢీ కొట్టారు.

ఆ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల బంధువులు బీమా పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. కారంపూడికి చెందిన లారీ యజమాని వసంతవరపు శ్రీనివాసులు సమర్పించిన బీమా పత్రాల్లోని పాలసీ వివరాలను బీమా కంపెనీకి పంపగా ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో బీమా కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నకిలీ బీమా సృష్టిలో ప్రకాశం జిల్లా కురిచేడుకు మండలానికి చెందిన అక్కలూరి గాందీ, గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వాహన కన్సల్టెన్సీ నిర్వాహకుడు షేక్‌ గౌస్‌బాషా, పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన వెంకటకృష్ణ, నరసరావుపేటకు చెందిన సయ్యద్‌ మస్తాన్‌షరీఫ్‌ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతోపాటు, ఈ ముఠా 200 వరకూ నకిలీ బీమా సరి్టఫికెట్లు సృష్టించారని విచారణలో వెల్లడైంది.

చాపకింద నీరులా నకిలీ దందా 
జిల్లాలోని ప్రైవేట్‌ వాహన ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులు, వాహన కన్సల్టెన్సీ నిర్వాహకులు, ఆర్టీఏ ప్రైవేట్‌ ఏజెంట్‌లు కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ బీమా దందాను చాపకింద నీరులా సాగిస్తున్నారు. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఆ సంస్థల ప్రమేయం లేకుండా ఆయా సంస్థల పేరిట నకిలీ బీమా సర్టిఫికెట్లు తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియం కంటే తక్కువ ధరకే ఈ సరి్టఫికెట్‌లు ఇస్తూ నకిలీ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో వాహన, రవాణా కన్సల్టెన్సీ ఏజెన్సీలు 450 వరకూ ఉన్నాయి. నెలలో జిల్లా వ్యాప్తంగా సగటున వెయ్యి నుంచి 1500 వాహనాల విక్రయాలు జరుగుతాయి.

ఇలా చేస్తారు.. 
నకిలీ బీమా పాలసీలు తయారు చేసేందుకు బీమా సంస్థలు జారీ చేసిన వాహన బీమా పాలసీలనే కాపీ చేస్తారు. అసలువాటితో ఏ మాత్రం తీసిపోకుండా నకిలీ బీమా పాలసీ సర్టిఫికెట్లను తయారుచేస్తారు. ఇలా జారీ చేసిన నకిలీ పాలసీలే కస్టమర్లకు, ఆర్‌టీఓకు సమరి్పస్తారు. కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాలు, ఫోర్‌ వీలర్లకు మూడేళ్ల దీర్ఘకాలిక థర్డ్‌ పార్టీ బీమాను ఇన్సూరెన్స్‌ రెగ్యులారిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఐఆర్‌డీఏ) తప్పనిసరి చేసింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారు అంతకన్నా తక్కువ సమయానికి పాలసీ తీసుకోవడానికి వీలు లేదు. ఇది వాహన యజమానులకు

భారం కావడం నకిలీ బీమా 
చేయించే వారికి మంచి అవకాశంగా మారింది. తక్కువ ప్రీమియంతో నకిలీ పాలసీలను అంటగట్టి వాహన యజమానులను దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బీమా పాలసీలపై అవగాహన లేమిని నకిలీ బీమా ముఠాలు సొమ్ముచేసుకుంటున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ సమయంలో సమరి్పంచిన బీమా పాలసీ వివరాలు సరైనవా? కాదా? అని విచారించే వెసులుబాటును ఐఆర్‌డీఏ రవాణా శాఖకు ఇవ్వలేదు. దీంతో వాహనదారులు సమరి్పంచిన పత్రాల ఆధారంగా నమ్మకంపై రవాణా శాఖ అధికారులు రిజి్రస్టేషన్‌లు చేస్తున్నారు. అనుమానం వచ్చిన సందర్భంలో సదరు వాహన బీమా సంస్థలను సంప్రదించి ఆరా తీస్తున్నారు. 

చైతన్యంతోనే నకిలీలకు చెక్‌
పుట్టగొడుగుల్లా బీమా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ బీమా సంస్థలను మాత్రమే పాలసీల కోసం ఆశ్రయించాలి. బీమా సంస్థల నుంచి గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దే బీమా చేయించాలి. 
బీమా పాలసీ తీసుకున్నప్పుడే కస్టమర్లు 
సంబంధిత బీమా కంపెనీ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి, ఈ–మెయిల్‌కు సందేశం పంపి తమ పాలసీ వివరాలను ధ్రువీకరించుకోవాలి. 
బీమా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఈ వివరాలు ధ్రువీకరించుకోవచ్చు.  
చెల్లించిన ప్రీమియానికి సంబంధిత కంపెనీ లోగో ముద్రించి ఉన్న అసలు రసీదును తప్పక తీసుకోవాలి. 
బీమా పాలసీలు ఇప్పుడు క్యుఆర్‌ కోడ్‌తో వస్తున్నాయి. క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా పాలసీ స్వభావం, అసలో నకిలీనో తెలుసుకోవచ్చు.   
బీమా చేయించుకునే ముందే కొంత సమయాన్ని వెచ్చించి పాలసీ వివరాలన్నీ చదవాలి. ఆపాలసీ ఎంత కవరేజీ ఇస్తున్నదీ 
తెలుసుకోవాలి. 
బీమా కంపెనీకి ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు ఉపయోగించి నేరుగా ప్రీమియం చెల్లించాలి.

మధ్యవర్తులను గుడ్డిగా నమ్మొద్దు 
వాహనదారులు బీమా పాలసీలు చేయించుకునేందుకు కన్సల్టెన్సీ, ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులు, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మొద్దు. మీ అవగాహన లేమి, అమాయకత్వాన్ని వాళ్లు సొమ్ము చేసుకుని నకిలీ పాలసీలు అంటగడతారు. బీమా పొందేముందు సంబంధిత సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి లేదా ఫోన్‌ ద్వారా సంప్రదించి పాలసీ వివరాలు తెలుసుకోవాలి. 
– ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ గుంటూరు
చదవండి:
తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం  
కొలకలూరులో వెయ్యేళ్లనాటి శివలింగాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement