Fake insurance documents
-
వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు
సాక్షి, గుంటూరు: రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. జిల్లాలో కొందరు ముఠాలుగా ఏర్పడి ఆపత్కాలంలో భరోసా ఇచ్చే వాహన బీమాల్లో నకిలీ దందా కొనసాగిస్తున్నారు. రవాణాశాఖకు సైతం అనుమానం రాకుండా నకిలీ బీమా సర్టిఫికెట్ల వ్యవహారం సాగిపోతోంది. గత ఏడాది అక్టోబర్ రెండో తేదీ ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ వంతెనపై నిబంధనలకు విరుద్ధంగా ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఢీ కొట్టారు. ఆ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల బంధువులు బీమా పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. కారంపూడికి చెందిన లారీ యజమాని వసంతవరపు శ్రీనివాసులు సమర్పించిన బీమా పత్రాల్లోని పాలసీ వివరాలను బీమా కంపెనీకి పంపగా ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో బీమా కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ బీమా సృష్టిలో ప్రకాశం జిల్లా కురిచేడుకు మండలానికి చెందిన అక్కలూరి గాందీ, గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వాహన కన్సల్టెన్సీ నిర్వాహకుడు షేక్ గౌస్‌బాషా, పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన వెంకటకృష్ణ, నరసరావుపేటకు చెందిన సయ్యద్ మస్తాన్‌షరీఫ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతోపాటు, ఈ ముఠా 200 వరకూ నకిలీ బీమా సరి్టఫికెట్లు సృష్టించారని విచారణలో వెల్లడైంది. చాపకింద నీరులా నకిలీ దందా జిల్లాలోని ప్రైవేట్ వాహన ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు, వాహన కన్సల్టెన్సీ నిర్వాహకులు, ఆర్టీఏ ప్రైవేట్ ఏజెంట్లు కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ బీమా దందాను చాపకింద నీరులా సాగిస్తున్నారు. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఆ సంస్థల ప్రమేయం లేకుండా ఆయా సంస్థల పేరిట నకిలీ బీమా సర్టిఫికెట్లు తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియం కంటే తక్కువ ధరకే ఈ సరి్టఫికెట్లు ఇస్తూ నకిలీ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో వాహన, రవాణా కన్సల్టెన్సీ ఏజెన్సీలు 450 వరకూ ఉన్నాయి. నెలలో జిల్లా వ్యాప్తంగా సగటున వెయ్యి నుంచి 1500 వాహనాల విక్రయాలు జరుగుతాయి. ఇలా చేస్తారు.. నకిలీ బీమా పాలసీలు తయారు చేసేందుకు బీమా సంస్థలు జారీ చేసిన వాహన బీమా పాలసీలనే కాపీ చేస్తారు. అసలువాటితో ఏ మాత్రం తీసిపోకుండా నకిలీ బీమా పాలసీ సర్టిఫికెట్లను తయారుచేస్తారు. ఇలా జారీ చేసిన నకిలీ పాలసీలే కస్టమర్లకు, ఆర్టీఓకు సమరి్పస్తారు. కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాలు, ఫోర్ వీలర్లకు మూడేళ్ల దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమాను ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఐఆర్డీఏ) తప్పనిసరి చేసింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారు అంతకన్నా తక్కువ సమయానికి పాలసీ తీసుకోవడానికి వీలు లేదు. ఇది వాహన యజమానులకు భారం కావడం నకిలీ బీమా చేయించే వారికి మంచి అవకాశంగా మారింది. తక్కువ ప్రీమియంతో నకిలీ పాలసీలను అంటగట్టి వాహన యజమానులను దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బీమా పాలసీలపై అవగాహన లేమిని నకిలీ బీమా ముఠాలు సొమ్ముచేసుకుంటున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ రెన్యూవల్ సమయంలో సమరి్పంచిన బీమా పాలసీ వివరాలు సరైనవా? కాదా? అని విచారించే వెసులుబాటును ఐఆర్డీఏ రవాణా శాఖకు ఇవ్వలేదు. దీంతో వాహనదారులు సమరి్పంచిన పత్రాల ఆధారంగా నమ్మకంపై రవాణా శాఖ అధికారులు రిజి్రస్టేషన్లు చేస్తున్నారు. అనుమానం వచ్చిన సందర్భంలో సదరు వాహన బీమా సంస్థలను సంప్రదించి ఆరా తీస్తున్నారు. చైతన్యంతోనే నకిలీలకు చెక్ ►పుట్టగొడుగుల్లా బీమా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ బీమా సంస్థలను మాత్రమే పాలసీల కోసం ఆశ్రయించాలి. బీమా సంస్థల నుంచి గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దే బీమా చేయించాలి. ►బీమా పాలసీ తీసుకున్నప్పుడే కస్టమర్లు సంబంధిత బీమా కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, ఈ–మెయిల్‌కు సందేశం పంపి తమ పాలసీ వివరాలను ధ్రువీకరించుకోవాలి. ►బీమా కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా ఈ వివరాలు ధ్రువీకరించుకోవచ్చు. ►చెల్లించిన ప్రీమియానికి సంబంధిత కంపెనీ లోగో ముద్రించి ఉన్న అసలు రసీదును తప్పక తీసుకోవాలి. ►బీమా పాలసీలు ఇప్పుడు క్యుఆర్ కోడ్‌తో వస్తున్నాయి. క్యూఆర్ కోడ్ ఆధారంగా పాలసీ స్వభావం, అసలో నకిలీనో తెలుసుకోవచ్చు. ►బీమా చేయించుకునే ముందే కొంత సమయాన్ని వెచ్చించి పాలసీ వివరాలన్నీ చదవాలి. ఆపాలసీ ఎంత కవరేజీ ఇస్తున్నదీ తెలుసుకోవాలి. ►బీమా కంపెనీకి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ఉపయోగించి నేరుగా ప్రీమియం చెల్లించాలి. మధ్యవర్తులను గుడ్డిగా నమ్మొద్దు వాహనదారులు బీమా పాలసీలు చేయించుకునేందుకు కన్సల్టెన్సీ, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మొద్దు. మీ అవగాహన లేమి, అమాయకత్వాన్ని వాళ్లు సొమ్ము చేసుకుని నకిలీ పాలసీలు అంటగడతారు. బీమా పొందేముందు సంబంధిత సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి లేదా ఫోన్ ద్వారా సంప్రదించి పాలసీ వివరాలు తెలుసుకోవాలి. – ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ గుంటూరు చదవండి: తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం కొలకలూరులో వెయ్యేళ్లనాటి శివలింగాలు -
నకిలీల గోల
రవాణాశాఖలో నకిలీ ఇన్సూరెన్స్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నకిలీ బీమా పత్రాల వ్యవహారంలో ఆ శాఖ అధికారులు, ప్రైవేట్ ఏజెంట్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే విషయం కొంతమంది బీమా, రవాణా ఏజెంట్లకు కలసివస్తోంది. ఫిట్నెస్, ట్రాన్స్ఫర్ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులతో అనధికార ఒప్పందం చేసుకుని నకిలీ పత్రాలతో జేబులు నింపుకుంటున్న పరిస్థితి ఉంది. రవాణాశాఖలో నకిలీల వ్యవహారం గత ఎస్పీ దృష్టికి వెళ్లింది. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. దీంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సొంతంగా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ ట్రాక్టర్‌కు నకిలీ బీమా పత్రం ఉంది. ఈ రీతిలో నకిలీ పత్రాలతో ప్రయానించే సమయంలో ప్రమాదం జరిగితే వాహనాల యజమానులతోపాటు గాయపడిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కో ధర.. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చేందుకు కొంతమంది బీమా, రవాణా శాఖ ఏజెంట్లు ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు రవాణా కార్యాలయం సమీపంలో ఓ మహిళా ఏజెంట్ కూడా నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. బీమా సంస్థకు ఇన్సూరెన్స్ చెల్లించాలంటే ఎక్కువ ధర ఉండడంతో ఎక్కువ మంది వాహనదారులు నకిలీ పత్రాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ఆటో, బైక్, ఎల్‌జీవీ, ట్రాక్టర్ యజమానులు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తీసుకుంటున్నట్లు సమాచారం. బైక్‌కు రూ.200 నుంచి రూ.300, ఆటోకు రూ.1500, లైట్ గూడ్స్ వెహికల్‌కు రూ.4,000, ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.1,000లు తీసుకుని నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇస్తున్నారు. ప్రధానంగా హెచ్బీఎఫ్సీ, ఫ్యూచర్ జనరల్, జీఓ డిజిట్, ఇస్కోటోక్యో, శ్రీరామ్ తదితర కంపెనీల మీద కొంతమంది ఏజెంట్లు నకిలీ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల జారీలో ఆటో ఫైనాన్స్ కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నెల్లూరు(టౌన్): ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంది. ఇన్సూరెన్స్ చెల్లిస్తేనే ఆ వాహనంపై లావాదేవీలను జరుపుతారు. వాహనాలకు ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చేందుకు పదుల సంఖ్యలో బీమా సంస్థలు ఉన్నాయి. ఏడాదికి ద్విచక్ర వాహనానికి రూ.1,400, ఆటోకు రూ.7,851లు, లైట్ గూడ్స్ వెహికల్‌కు రూ.18,600, ట్రాక్టర్‌కు రూ.14,500, లారీకి రూ. 35,000 ఇన్సూరెన్స్చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు పలు ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం, వాహన యజమానికి, బయట వ్యక్తులు గాయపడిన సమయంలో సంస్థ నిబంధనలు ప్రకారం బీమాను వర్తింపజేస్తారు. కలసివస్తున్న ఆన్లైన్ విధానం రెండేళ్ల క్రితం రవాణాశాఖలో 80కు పైగా సేవలను ఆన్లైన్ చేశారు. దీంతో మీసేవ, ఏపీఆన్‌లైన్, కామన్ సర్వీస్ సెంటర్ తదితర వాటిల్లో ఆన్లైన్ సేవలు నిర్వహిస్తున్నారు. అయితే వాహన లావాదేవీలకు సంబంధించి పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఫిట్నెస్, వాహన ట్రాన్స్ఫర్ల సమయంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఆన్లైన్ విధానం కావడంతో ఒరిజనల్ పత్రాలను చూసే పరిస్థితి రవాణా అధికారులకు ఉండదు. అనుమానం వస్తే తప్పనిసరిగా విచారణ చేయాలి. అదేం లేకుండా నకిలీ పత్రాన్ని ఓకే చేసినందుకు సంబంధిత గుమస్తా, ఏఓ, ఆర్టీఓకు రూ.300 నుంచి రూ.700 వరకు ముట్టజెప్పాల్సి ఉంటుందని సమాచారం. ప్రమాదం జరిగితే అంతే.. నకిలీ ఇన్సూరెన్స్‌లు ఉన్న వాహనాలు ప్రమాదాలకు గురైతే ఒక్కపైసా కూడా రాదు. పైగా ప్రమాదంలో వాహన యజమాని, లేదా బయట వ్యక్తి గాయపడినా, మృతి చెందినా బీమా సంస్థ నుంచి రూపాయి కూడా అందదు. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నకిలీ ఇన్సూరెన్స్ పత్రం కావడంతో మరణించిన వ్యక్తికి రూ.7 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న ట్రాక్టర్‌ను యజమానే సొంత డబ్బులతో రిపేరు చేయించుకున్నారు. అదే ఒరిజనల్ ఇన్సూరెన్స్ పత్రం కలిగి ఉంటే వాహనంతో పాటు మరణించిన వ్యక్తికి సంస్థ నుంచి నగదు వచ్చేది. ఇప్పటికీ నకిలీ బీమా పత్రాలు కలిగి ప్రమాదాలు జరిగి పలు వాహనాల మీద కేసులు నడుస్తున్నాయి. నకిలీ బీమా పత్రాల మీద గత ఎస్పీకి కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. ఇప్పటికైనా నకిలీ బీమా పత్రాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీప్రతినిధులతో సమావేశం నకిలీ ఇన్సూరెన్స్లకు సంబంధించి ఆయా బీమా కంపెనీ ప్రతినిధులతో వచ్చేవారం సమావేశం నిర్వహిస్తాం. ఇన్సూరెన్స్ పత్రానికి సంబంధించి క్యూ ఆర్‌ను పరిశీలిస్తున్నాం. ఇప్పటి నుంచి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. పట్టుబడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.–సుబ్బారావు, రవాణా శాఖఉప కమిషనర్ -
నకిలీ బీమా పత్రాల నిందితుడు అరెస్టు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో నకిలీ బీమా పత్రాలపై సాక్షి టీవీ చేసిన నిఘా ప్రసారాలపై పోలీసులు స్పందించారు. శ్రీ ఆటో కన్సల్టేన్సీ, ఇన్సూరెన్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుడు నానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నానిని, అతనికి సహకరించిన మహిళను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇటువంటి నకీలీ పత్రాల వల్లన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల కుటుంబాలు, క్షతగాత్రులు తీవ్రంగా నష్టపోతారని ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు. -
ఈ బీమాతో లేదు ధీమా!
సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా వాహనానికి బీమా ఎందుకు చేయించుకుంటారు..? నిబంధనల ప్రకారం తప్పనిసరి కావడం ఒక కారణమైతే, ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే కుటుంబానికి అక్కరకు వస్తుందనే ధీమా మరో కారణం. ఆ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న బీమా పత్రాలు బోగస్ అని తేలితే... ఆ నష్టం ఎవ్వరూ పూడ్చలేనిదిగా మారుతుంది. తాను బజాజ్ అలయన్జ్ ఇన్సూరెన్స్ సంస్థ ఏజెంట్‌గా పరిచయం చేసుకుని, డబ్బు తీసుకున్న తర్వాత తానే తయారు చేసిన బోగస్ సర్టిఫికెట్లు అందిస్తున్న మోసగాడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. ఇతగాడు 293 మంది వాహనాలకు సంబంధించి ఇలాంటి బోగస్ పత్రాలు తయారు చేసి అందించినట్లు ఆయన వివరించారు. ఎంబీఏ చదివి నగరానికి వచ్చి... కరీంనగర్ జిల్లా కదికొట్కూర్ గ్రామానికి చెందిన గుడిమల శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం మూడేళ్ళ క్రితం నగరానికి బోయిన్పల్లి ఆనంద్నగర్ల్లో స్థిరపడ్డాడు. కొన్నాళ్ళ పాటు ఈసీఐఎల్ కేంద్రంగా బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో టెరిటొరీ మేనేజర్‌గా (టీఎం) విధులు నిర్వర్తించాడు. వాహన యజమానులు, వాహనాల షోరూమ్స్ నిర్వాహకుల నుంచి వివరాలు, బీమా మొత్తం వసూలు చేయడం, తమ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ చేయించి ఆ పత్రాలను తిరిగి వారికి అందించడం ఇతడి విధి. కొన్నాళ్ళ పాటు సక్రమంగా పని చేసినా ఆపై శ్రీకాంత్ బుద్ధి వక్రమార్గం పట్టడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై కొంతకాలం ఖాళీగానే ఉన్న ఇతగాడికి ఓ దుర్బుద్ధిపుట్టింది. వాహన ఇన్సూరెన్స్ రంగంలో తనకు ఉన్న అనుభవాన్ని వాడుకుని బోగస్ బీమా పత్రాలు అందించే దందా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా తాను ఇప్పటికీ బజాజ్ అలయన్జ్ సంస్థలో పని చేస్తున్నట్లు బోగస్ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి... ఈ బోగస్ కార్డుతో పాటు తన ‘పాత యూనిఫాం’ ఆధారంగా బోయిన్‌పల్లిలోని శ్రీ మోటార్స్‌తో పాటు శ్రీసాయి మోటర్స్, ఆర్కే మోటార్స్ సంస్థలను సంప్రదించాడు. తాము ఇతర సంస్థల కన్నా ఆకర్షణీయమైన అంశాలతో వాహన బీమా పాలసీ ఇస్తామంటూ ఎర వేశాడు. ఇతడి వాక్చాతుర్యానికి బుట్టలో పడ్డ ఆ షోరూమ్స్ నిర్వాహకులు వాహనాలకు సంబంధించిన వివరాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం అందించారు. గతంలో బజాజ్ అలయన్జ్ సంస్థలో పని చేస్తున్నప్పుడూ కొన్నిసార్లు ఆయా షోరూమ్స్‌కు వెళ్ళిన ఇతడు తన విధిని నిర్వర్తించాడు. అప్పట్లో వాహనాన్ని ఖరీదు చేసిన వారి వివరాలను తమ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న యాప్‌లో నమోదు చేసుకునే వాడు. ఇవి బజాజ్ అలయన్జ్ సంస్థకు చేరి ఇన్సూరెన్స్ పత్రం తయారై వచ్చేంది. శ్రీకాంత్ ఆయా షోరూమ్స్‌ను మోసం చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఆ వివరాలు నమోదు చేసుకుని వెళ్ళే వాడు. ఇంటర్నెట్ నుంచి పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసిన ఇన్సూరెన్స్ పత్రాన్ని వర్డ్ ఫార్మాట్లోకి మార్చేవాడు. ఇందులో పేర్లు, వాహన నెంబర్లు మార్చి తనకు కావాల్సినవి చేర్చేవాడు. ఆపై ప్రింట్ తీయడం ద్వారా తయారైన బోగస్ పత్రాన్ని ఆయా షోరూమ్స్ అందించాడు. వాహన ప్రమాదంతో వెలుగులోకి... ఇలా మొత్తం దాదాపు 400 వాహనాలకు సంబంధించి షోరూమ్స్ నుంచి డబ్బు వసూలు చేసిన శ్రీకాంత్ కేవలం 130 వాహనాలకు మాత్రమే వేరే ఏజెంట్‌తో ఇన్సూరెన్స్ చేయించాడు. మిగిలిన వాటికి తానే తయారు చేసిన బోగస్‌వి అందించాడు. ఇలా మొత్తం రూ.17.5 లక్షలు స్వాహా చేశాడు. ఇతడు అందించిన బోగస్ బీమా పత్రాన్ని షోరూమ్ ద్వారా అనేక మంది వాహనచోదకులు పొందారు. ఇలాంటి వాహనచోదకుల్లో ఒకరి ద్విచక్ర వాహనం ఇటీవల చోరీకి గురైంది. దీంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన బాధితుడు వాహనానికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ కంపెనీని సంప్రదించారు. ఇతడు తీసుకువచ్చిన పత్రంపై ఉన్న నెంబర్‌ను ఆన్లైన్లో తనిఖీ చేసిన కంపెనీ ప్రతినిధులు వేరే వ్యక్తి, వాహన నెంబర్‌తో ఉన్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు షోరూమ్ నిర్వాహకుడిని సంప్రదించాడు. వారు శ్రీకాంత్‌ను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బోయిన్పల్లి ఠాణాలో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది. ఇతడిని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన బృందం శ్రీకాంత్‌ను పట్టుకుంది. ఇతడి నుంచి బోగస్ పత్రాలు, కంప్యూటర్, రబ్బర్ స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బోయిన్పల్లి పోలీసులకు అప్పగించింది. -
విజయవాడలో నకిలీ బీమా పత్రాలు
విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : నగరంలో భారీగా నకిలీ బీమా పత్రాలు చలామణిలో ఉన్నాయి. కొందరు ఏజెంట్లు వాహన యజమానులను బురిడీ కొట్టించి నకిలీ బీమా పత్రాలు అంటగడుతున్నారు. వాహనం చోరీకి గురైన, రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భాల్లో వీరి బాగోతం వెలుగులోకి వస్తున్నా..ఏదో విధంగా ‘మేనేజ్’ చేసుకొని బయటపడుతున్నారు. యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. రవాణాశాఖ అధికారుల ఉదాసీనత..వాహన యజమానుల అమాయకత్వాన్ని వీరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంకుల బీమా విభాగంలో పనిచేసి మానేసిన వారే ఎక్కువగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దికాలం కిందట నగరంలోని ఓ వ్యక్తి వాహనం చోరీకి గురైంది. వాహనం ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో..పోలీసుల సలహా మేరకు ఓ ప్రైవేటు బీమా కంపెనీ అధికారులను కలిసి సమస్య వివరించారు. తన వాహనం బీమా కాలపరిమితి తీరలేదని చెప్పిన మీదట..అక్కడి అధికారులు పరిశీలించి ఆ బీమా పత్రం తమ కంపెనీది కాదని తేల్చారు. తమ కంపెనీ పేరిట ఎవరో నకిలీది తయారు చేసి ఇచ్చి ఉండొచ్చని చెప్పడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో కూపీ లాగిన పోలీసులు.. పెద్ద మొత్తంలో నకిలీ బీమా పత్రాలు నగరంలో చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గతంలో ఓ ప్రైవేటు బ్యాంకు బీమా విభాగంలో పనిచేసిన ఆ వ్యక్తి ఇంట్లోని కంప్యూటర్‌తో ఈ నకిలీ బీమా పత్రాలు తయారు చేస్తున్నాడు. తనకున్న పరిచయాలను ఆసరాగా చేసుకొని బీమా ఏజెంట్ అవతారమెత్తి..ఈ నకిలీలను వాహన చోదకులకు అంటగడుతున్నాడు. వాటిపై గతంలో తాను పని చేసిన ప్రైవేటు బ్యాంకు ముద్ర కూడా వేసి ఇవ్వడంతో..యజమానులు అనుమానించడం లేదు. తీరా మోసపోయిన తర్వాత లబోదిబోమనడం యజమానుల వంతైంది. ఈ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా నగరంలోని నకిలీ పత్రాల మోసగాళ్లను గుర్తించే ప్రయత్నం చేపట్టారు. ఏజెంట్ల తీసుకొచ్చే వాహనాల కాగితాలపై రవాణా అధికారులు తగిన విచారణ చేయకుండానే లెసైన్స్‌లు నవీకరించడం.. ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం వల్లే ఇలాంటి కేటుగాళ్లు చెలరేగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కట్టడి ఇలా వాహనాల ఫిట్నెస్ చూసేటప్పుడు రవాణాశాఖ అధికారులు బీమా పత్రాలు అసలువా? నకిలీవా? సరిపోల్చుకోవాలి. లెసైన్స్‌లు రెన్యువల్ సమయంలోను కూడా తగిన విధంగా బీమా పత్రాలపై విచారణ జరపాలి. ఎక్కువగా ఏజెంట్లు తీసుకొచ్చే వాహనాల విషయంలోనే నకిలీలు ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీటిపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. బీమా ప్రయోజనాలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తులు మరణిస్తే వాహనంపై చేసిన బీమా ఆధారంగా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు వస్తుంది. దీంతో వాహన యజమాని నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు.. దెబ్బతిన్న దానికి డామేజీ బీమా ఇస్తారు. వాహనాలు చోరీకి గురైతే బీమా కంపెనీల నుంచి తగిన పరిహారం యజమానికి అందుతుంది. నకిలీలతో నష్టాలు రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తులు మరణించినప్పుడు థర్డ్ పార్టీ బీమా ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించవు. దీంతో ప్రమాదంలో వ్యక్తులను కోల్పోయిన వారు నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉండదు. డామేజీ వాహనాలకు పైసా కూడా రాదు. వాహనం చోరీకి గురైతే ఇక అంతే సంగతులు. పరిహారం రాక వాహన యజమాని ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.