సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో నకిలీ బీమా పత్రాలపై సాక్షి టీవీ చేసిన నిఘా ప్రసారాలపై పోలీసులు స్పందించారు. శ్రీ ఆటో కన్సల్టేన్సీ, ఇన్సూరెన్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుడు నానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నానిని, అతనికి సహకరించిన మహిళను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇటువంటి నకీలీ పత్రాల వల్లన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల కుటుంబాలు, క్షతగాత్రులు తీవ్రంగా నష్టపోతారని ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment