అంజయ్యను వారిస్తున్న గ్రామస్తులు
నంగునూరు (సిద్దిపేట): కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా, తనకు చెందాల్సిన భూమిని తహసీల్దార్ మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సం ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదు ట చోటు చేసుకుంది. బద్దిపడగకు చెందిన బానోతు అంజయ్య 28 సంవత్సరాల కిందట గుడిపల్లి యాదయ్య, చంద్రకళ, పోచయ్య, అశోక్ నుంచి 6 ఎకరాల 29 గుంటల భూమిని కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నాడు.
మూడు సంవత్స రాల కిందట భూమిని విక్రయించిన వ్యక్తులు అంజయ్య తమ భూమిని ఆక్రమించుకున్నాడని కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం కోర్టు అంజయ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ధరణి పోర్టల్ ప్రారంభం కావడంతో భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో రెండు సంవత్సరాలుగా అంజయ్య తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే భూమిని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్న విషయం తెలుసుకున్న అంజయ్య తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని వెంటతెచ్చుకున్న డీజిల్ శరీరంపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి అంజయ్యను సముదాయించి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment