![Husband Cut The Wife Throat With Knife In Chittoor District - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/27/57877.jpg.webp?itok=atn3SoKA)
ప్రతీకాత్మక చిత్రం
వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా): అనుమానంతో భార్య గొంతు కోసి భర్త పరారైన సంఘటన మండలంలోని సీఆర్‌కండ్రిగలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపి కథనం మేరకు, గ్రామానికి చెందిన సూరి, అదే గ్రామానికి చెందిన సౌందర్య(23) ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, ఇటీవల అనారోగ్యంతో కుమారుడు మృతి చెందాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
భార్యపై అనుమానంతో భర్త శనివారం ఉదయం ఇంట్లోనే సౌందర్య గొంతును కత్తితో కోసి పరారయ్యాడు. స్థానికులు గమనించి జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ గోపి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సౌందర్యను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment