సాక్షి, కుత్బుల్లాపూర్: ఓఎల్‌ఎక్స్ వేదికగా మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుచిత్ర సమీపంలోని కృష్ణమూర్తినగర్‌కు చెందిన ఇవాన్ రాజు ఫ్లూటర్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగి. కాగా ఏప్రిల్ 20న ఓఎల్‌ఎక్స్ యాప్‌లో ఓ వ్యక్తి ప్లే స్టేషన్–5 అనే వస్తువును విక్రయానికి పెట్టగా అది చూసిన ఇవాన్‌రాజు తన ఫోన్ నంబర్‌ను షేర్ చేశాడు. వెంటనే అతడికి రంజిత్‌రెడ్డి (ఫోన్ నం. 790837947)అనే వ్యక్తి కాల్ చేశాడు. గూగుల్ పే ద్వారా అకౌంట్ నం. 6281673654కు రూ.15 వే లు పంపితే ‘ప్లే స్టేషన్–5’ను పంపుతానని చెప్పా డు. అంతేకాకుండా తన ఆధార్ కార్డు ఫొటోను సైతం షేర్ చేశాడు. దీంతో అతడిపై నమ్మకం కలిగి ఇవాన్‌రాజు రూ.15 వేలు పంపాడు.
ఆ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఖర్చుల నిమిత్తం మరో రూ.6,500 పంపాలని కోరగా.. ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ నంబర్ అంటూ 830 9520268 పంపాడు. అయితే, సదరు వస్తువును ఎంతకీ డెలివరీ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గత నెల 25న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు న మోదు చేశారు. ఫోన్ నంబర్, ఆధార్ కార్డుల ఆధా రంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసానికి పా ల్పడిన వ్యక్తి బాగ్‌అంబర్‌పేట్ రామకృష్ణనగర్‌కు చెందిన రంజిత్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశానుసారం రంజిత్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment