మద్యం రవాణాదారుల అరెస్ట్ చూపుతున్న ఎస్‌ఈబీ అధికారులు
కర్నూలు: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తనిఖీల్లో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్‌ఈబీ సీఐ మంజుల, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాయచూరు వైపు నుంచి వచ్చిన అశోక్ లేల్యాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా, వాహనం వెనుక భాగంలోని ట్రాలీ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాక్‌లో 3,456 టెట్రా ప్యాకెట్లు బయటపడ్డాయి. వాహనంలో ఉన్న పోలకల్లు గ్రామానికి చెందిన పరశురాముడు, గూడూరుకు చెందిన రాఘవేంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మద్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కర్నూలు ఎస్‌ఈబీ అధికారులకు అప్పగించినట్లు సీఐ మంజుల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment