నల్గొండ: త్రిపురారం మండలం కొనతాలపల్లికి చెందిన పెద్ది సైదులును కొట్టడంతోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ శుక్రవారం మండలంలోని వెంగన్నగూడెం గ్రామానికి చెందిన బొమ్ము శివ ఇంటి వద్ద ఆందోళన చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కొనతాలపలికి చెందిన పెద్ది సైదులు నిడమనూరులోని లిటిల్ ఏంజల్స్ స్కూల్‌లో బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. దీంతో అతడు మండలంలోని వెంగన్నగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళతో సఖ్యతా మెలగడంతో గ్రామానికి చెందిన బొమ్ము శివ అతడి అనుచరులు కలిసి మూడు నెలల క్రితం సైదులును కొట్టారు.
దీంతో సైదులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. శివ అతడి అనుచరులు కొట్టడంతోనే మృతి చెందాడని సైదులు బంధువులు ఆరోపిస్తూ మృతదేహాన్ని బొమ్ము శివ ఇంటిలో పెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో శివ కుటుంబ సభ్యులు ఉదయమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. హాలియా సీఐ గాంధీనాయక్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హాలియా ఎస్‌ఐ క్రాంతికుమార్, నిడమనూరు ఎస్‌ఐ శోభన్‌బాబు వెంగన్నగూడెంలో ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం పోస్ట్‌మార్టమ్ నిమ్తితం సైదులు మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సైదులు తండ్రి పెద్ది రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.
త్రిపురారం : దాడిచేసిన ఘటనలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొణతాలపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణతాలపల్లి గ్రామానికి చెందిన పెద్ది సైదులు నిడమనూరులో ఓప్రైవేట్ పాఠశాల బస్సు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇదే క్రమంలో నిడమనూరు మండలంలోని వెంగన్నగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సైదులును గత నెల కిందట దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment