
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): దావణగెరె జిల్లాలో మ్యాసరహళ్లి కి చెందిన 25 ఏళ్ల యువతికి ఇద్దరు దుండగులు మద్యం తాగించి అత్యాచారం చేశారు. నిందితులు అదే గ్రామానికి చెందిన ప్రభు, కుందువాడ కిరణ్‌లు కాగా, పరారీలో ఉన్నారు. ఒక పొలంలో పడి ఉన్న మహిళను కొందరు చూసి దావణగెరె జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఒంటరి మహిళ అని తెలిసింది. ఈ ఘటనపై దావణగెరె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
వ్యక్తి అసభ్య ప్రవర్తన
హుబ్లీ: నవనగర్ క్యాన్సర్ ఆస్పత్రి ఎదుట శాంతి నగర్ నివాసి బసవరాజ దేవగుడి అనేవ్యక్తి బైక్‌పై కూర్చొని దుస్తులు విప్పేసి అటుగా వెళ్తున్న యువతులపట్ల అసభ్యంగా వ్యవహరించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు నవనగర పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించార