
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
బోయిన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment