సాక్షి, వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో 14 ఏళ్ల బాలిక కామాంధుల కాటుకు బలైంది. వివరాల్లోకెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేపల్లె గ్రామానికి చెందిన ఒక మహిళ తన భర్త చనిపోవడంతో కూతురు, తల్లితో కలిసి నివాసముంటోంది. ఆమె కూతురు భూపాలపల్లి జిల్లా కాటారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం పాఠశాలలు పూర్తిగా తెరచుకోకపోవడంతో బాలిక ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు.
అనంతరం పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. అయితే అది గమనించిన యువకులు బాలికకు గర్భం పోవడానికి గత నెల 26వ తేదీన కొన్ని మాత్రలు ఇచ్చారు. దీంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. అయితే ఆ బాలికకు జ్వరం రావడం వల్లనే మృతి చెందింది అంటూ యువకులు చనిపోయిన బాలిక తల్లితో పోలీసులకు చెప్పించారు. చదవండి: (హైటెక్ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే)
అయితే అసలు విషయము గ్రామంలో తెలిసిపోవడంతో మృతురాలి తల్లి ఈ నెల 3వ తేదీన తన కూతురు ముగ్గురు యువకులు వేధించడం వల్లనే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, దుగ్గొండి మండలానికి చెందిన ఇద్దరు యువకులతో పాటు వర్ధన్నపేట మండలానికి చెందిన ఇంకో యువకుడు కూడా అమ్మాయిని వేధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై ఎస్సై రవి కిరణ్‌ని వివరణ కోరగా మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (అమెరికాలోనే ప్రేమలత అంత్యక్రియలు)
Comments
Please login to add a commentAdd a comment