
భువనేశ్వర్: తొలుత పిల్లలకి విషమిచ్చి, ఆ తర్వాత తాను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లి. ఈ దుర్ఘటనలో బిజూ(3), రాజు(4) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో ఏడాదిన్నర చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని చందక పోలీస్‌స్టేషన్ పరిధి, బింఝాగిరి ప్రాంతంలో ఈ విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కొండొలై గ్రామానికి చెందిన జానకి గగరెయి తన ముగ్గురు పిల్లలతో కలిసి అదే గ్రామంలోని తన ఇంట్లో నివశిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడడం స్థానికంగా సంచలనం రేకిత్తిస్తోంది.
ఇంట్లో విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వీరిని తొలుత గ్రామస్తులు గుర్తించి, వైద్యసేవల నిమిత్తం స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి వీరిని తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని కటక్ శిశు భవన్‌కి.. తల్లిని కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన చందకా ఠాణా పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment