![Rowdy Assassinated Man For Name In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/21/wife-and-husband.jpg.webp?itok=wmCV-H6N)
హుబ్లీ: రౌడీగా పేరు తెచ్చుకోవాలన్న సరదాతో ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీ గిరానిచలలో చోటు చేసుకుంది. హతుడిని రవి ముద్దనకేరిగా గుర్తించారు. మంగళవారం రవితో జగడానికి దిగిన రౌడీ విజయ్ అనే వ్యక్తి అతనిని బాగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రవిని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతి చెందాడు. విజయ్ సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణాకు అధికారులు కళ్లెం వేశారు. ఈ నేపథ్యంలో డాబా హోటల్ తెరడానికి ప్రయత్నిస్తున్న అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు హుబ్లీ ఉపనగర పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడు. కాగా కిమ్స్‌లో హతుడి మృతదేహాన్ని డీసీపీ రామానుజం పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment