పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు | Supari Culture Growing In The City Assassins Entered Into The Field | Sakshi
Sakshi News home page

పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు

Published Fri, Mar 4 2022 8:37 AM | Last Updated on Fri, Mar 4 2022 8:45 AM

Supari Culture Growing In The City Assassins Entered Into The Field - Sakshi

సాక్షి హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడలో చోటు చేసుకున్న రియల్టర్ల జంట హత్యలు కిరాయి హంతకుల పనిగా తేలింది. ఇలాంటి ఉదంతాలు రాజధానిలో అనేకం వెలుగు చూస్తున్నాయి. హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని తీసుకునే మెుత్తాన్ని సుపారీ అంటారు.

ఇది ముంబై మాఫియా సామ్రాజ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పదం. అక్కడ కిరాయి హత్య చేయడానికి సిద్ధమైన వ్యక్తికి డబ్బుతో పాటు ఓ సుపారీ ఇస్తారు. అందుకే కిరాయి హత్యలు సుపారీలు ప్రాచుర్యం పొందాయి. హత్యలకు సుపారీ తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కిరాయి హంతకులు కొన్ని రోజులు ఆశ్రయం పొందుతున్నారు. దీనికో సం హోటళ్లు, లాడ్జిల్ని ఆశ్రయిస్తున్నారు.  అక్కడి నుంచే రెక్కీ, పథక రచన, దానిని అమలు చేస్తున్నా రు. తమ టార్గెట్‌ కదలికల్ని గమనించడానికి వారి ఇల్లు, వ్యాపార ప్రదేశాలకు సమీపంలో ఉన్న లా డ్జిల్లో హంతక ముఠాలు దిగుతున్నాయి.

ఆపై అదు ను చూసుకుని తెగబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న లాడ్జిలను ఆ స్టేషన్‌ సిబ్బంది రాత్రిపూట తనిఖీ చేయాలి. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా వా టిపై నిఘా ఉంచాలి. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి ఇది ఎంతో అవసరం. నిఘా ప్రక్రియ మెుక్కుబడిగా సాగడంతో అనేక కేసుల్లో ఏదైనా ఉదంతం జరిగిన అనంతరమే పోలీసులు గుర్తించగలుగుతున్నారు. ఒకసారి కిరాయి హత్యకు పాల్పడిన, కుట్ర చేసిన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు ఆపై చేతులు దులుపుకుంటున్నారు. ఆ నేర గాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? అనే అంశాల్ని అవసరమైన స్థాయిలో పర్యవేక్షించడం లేదు. చైన్‌ స్నాచర్, పిక్‌ పాకెటర్‌పై ఉన్న నిఘా కూడా వీరిపై ఉండట్లేదు.

అందుకు అవసరమైన సిబ్బంది, నిఘా యంత్రాంగం కూడా అందుబాటులో లేదు. వారిపై నిఘా కొరవడినందుకే నేరం జరిగిన తరవాతే పట్టుబడుతున్నారు.  అరుదైన సందర్భాల్లోనే నేరం చేయడానికి ముందు దొరుకుతున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులకు బందోబస్తులు, రోటీన్‌ డ్యూటీల మినహా మిగిలిన వ్యవహారాలు చూడటం కష్టసాధ్యంగా మారిపోవడం సైతం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది.

ఈ కిరాయి హంతకులు ఎక్కువగా నాటు తుపాకులనే వాడుతున్నారు. వీరికి ఈ ఆయుధాలన్నీ ప్రధానంగా ఉత్తరాది నుంచి వచ్చి చేరుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కొన్ని చోట్ల నాటు తుపాకులు, కత్తులు విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వాటిని తీసుకువచ్చి విక్రయించే ముఠాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో వ్యవస్థీకృతంగా కిరాయి హత్యలు చేసే వాళ్లు అరుదు. ఈ నేపథ్యంలోనే పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి పని పూర్తి చేసుకువెళ్లే ఎక్కువగా ఉంటున్నారు. 

(చదవండి: మెడికల్‌ కౌన్సిల్‌’ కేసులో ముగ్గురి అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement