
సాక్షి, హైదరాబాద్: హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ బీ.శివ ప్రసాద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ సృష్టించినట్లు సైబర్ క్రైమ్స్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ అకౌంట్ నుంచి పలువురు ప్రముఖులకు ఫ్రెండ్స్ రిక్వెస్టులు, మెసేజ్‌లు చేస్తున్నారని అందులో తెలిపారు. తక్షణమే తన పేరు మీదున్న నకిలీ అకౌంట్‌ను తొలగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఏజీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment