
హస్తినాపురం: అతివేగంతో వచ్చిన టిప్పర్ బైకును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ బి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా పంపర మండలం పూడి గ్రామానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ (36), ఆయన స్నేహితుడు ముద్దాల సతీష్ (38)లు కూకట్‌పల్లి ప్రగతినగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.
శనివారం ఉదయం వీరిద్దరూ కలిసి వనస్థలిపురంలో కూలిపనుల కోసం బైకుపై బయలుదేరారు. సుష్మా సిగ్నల్ సమీపంలోకి రాగానే వీరి బైకును టిప్పర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, సతీష్‌లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ మహ్మద్ రఫీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment