
సాక్షి, నల్గొండ: జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కిరాతంగా కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన ఇద్దరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment