
భోపాల్: సభ్యసమాజం తలదించుకొనే సంఘటన భోపాల్‌లో చోటుచేసుకొంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే తన కూతురిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. భార్య, కూతురు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జెహంగీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంట్లో లేనప్పుడు మొదటిసారి కూతురుపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని ఎక్కడ అరెస్టు చేస్తారో అని బాలిక భయపడుతూ ఉండేది. ఇదే అదనుగా భావించిన కసాయి తండ్రి మరింత రెచ్చిపోయాడు.
బాధితురాలు గత ఫిబ్రవరిలో తన తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇక తండ్రిపై విసిగిపోయిన కూతురు తన బాధను తల్లితో చెప్పుకొంది. ఇది తెలుసుకున్న ఆ తండ్రి.. భార్య, కూతురిని తీవ్రంగా హింసించాడం మొదలుపెట్టాడు. ఆ బాధలు భరించలేక తల్లి, కూతురు జెహంగీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పలు సెక్షన్‌ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: మత్తుమందిచ్చి.. ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment