
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఫొటోలు
పీఎం పాలెం(భీమిలి): ఇటీవల పీఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని హల్ చేసి రూ.20 లక్షల నగదుతో పారిపోయిన ‘మహానగరంలో మాయగాళ్లు’లో ఇద్దరు నిందితుల సీసీ ఫుటేజీ ఫొటోలను పీఎం పాలెం క్రైం విభాగం పోలీసులు గురువారం విడుదల చేశారు. చంద్రశేఖరరావు అనే వ్యక్తి నగరానికి చెందిన కోటేశ్వరరావుకు అతి తక్కువ ధరకే బంగారం అమ్ముతామని మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈ నెల 17న రాత్రి కోటేశ్వరరావు రూ.20 లక్షల నగదు తీసుకుని స్టేడియం సమీపానికి చేరుకున్నారు. చంద్రశేఖరరావు, వారి అనుచరులు అప్పటికే ముందుస్తు ప్రణాళిక ప్రకారం మాటు వేసి నకిలీ పోలీసు కారుతో హల్‌చల్ చేసి కోటేశ్వరరావు వద్ద నుంచి నగదు లాక్కుని పారిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు క్రైం విభాగం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇద్దరి నిందితుల ఛాయా చిత్రాలను సీసీ ఫుటేజీ ఆధారంగా విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిస్తే పీఎంపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వాలని క్రైం విభాగం ఎస్సై అప్పారావు కోరారు. క్రైం సీఐ ఫోన్ నంబర్ 94906 62712, క్రైం ఎస్సై నంబర్ 94409 04314కు సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment