ఆఖరి చూపు దక్కలే.. ఆమె తిరిగి రాలే | Wife Dead And Husband Injured In Road Accident Khammam | Sakshi
Sakshi News home page

ఆఖరి చూపు దక్కలే.. ఆమె తిరిగి రాలే

Published Thu, Dec 23 2021 8:14 AM | Last Updated on Thu, Dec 23 2021 8:40 AM

Wife Dead And Husband Injured In Road Accident Khammam - Sakshi

తాళ్లూరి మరియమ్మ( ఫైల్‌)

సాక్షి,వైరా( ఖమ్మం): బోనకల్‌ మండలం సీతానగరానికి చెందిన తాళ్లూరి నాగేశ్వరరావు, తాళ్లూరి మరియమ్మ (50) తల్లాడ మండలం అన్నారుగూడెంలోని సమీప బంధువు చనిపోవడంతో చివరిచూపునకు బయల్దేరగా ఆమెను టిప్పర్‌ రూపంలో మృత్యువు వెంటాడింది. బుధవారం టీవీఎస్‌ మోపెడ్‌పై వెళ్తుండగా స్టేజీపినపాక వంతెన సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని స్లో చేయగా..వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ బలంగా ఢీకొంది.

ఈ ప్రమాదంలో మరియమ్మ టిప్పర్‌ చక్రాల మధ్య పడిపోగా 30 మీటర్ల దూరం మేర ఈడ్చుకుపోవడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. ఎడమవైపు పడిన నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలవగా..స్థానికులు 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మరో రెండు రోజుల్లో క్రిస్మస్‌ పండుగకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రమాదం వారింట విషాదం నింపిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై శాకమూరి వీరప్రసాద్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.‍

చదవండి: గుట్కాలు కొన్న విషయం ప్రిన్సిపాల్‌కి తెలియడంతో.. ఏం జరుగుతుందోనని భయపడి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement